Breaking News

'నా శ్రీదేవి' అంటూ హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్.. యంగ్ హీరోయిన్‌పై డైరెక్టర్ కామెంట్స్ వైరల్


ఈ రోజుల్లో ఓ సాంగ్ హిట్ అయ్యిందంటే చాలు రికార్డుల సునామీ సృష్టిస్తుండటం చూస్తున్నాం. సోషల్ మీడియా హవా పెరగడం, ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు అందుబాటులోకి రావడంతో యూట్యూబ్‌లో సాంగ్స్ వీక్షించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో నెట్టింట మ్యూజికల్ హిట్స్ ఓ రేంజ్‌లో దూసుకుపోతూ మిలియన్ల కొద్ది వ్యూస్ రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రూపొందించిన 'గద్దలకొండ గణేష్' సినిమాలోని ''ఎల్లువొచ్చి గోదారమ్మ'' సాంగ్ అరుదైన ఫీట్ సాధించింది. మెగా వారసుడు, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గద్దలకొండ గణేష్' సినిమాలో యంగ్ హీరోయిన్ హీరోయిన్‌గా నటించి పలువురి ప్రశంసలందుకుంది. ఈ మూవీలో శోభన్ బాబు- శ్రీదేవి కాంబినేషన్‌లో అప్పట్లో వచ్చిన 'దేవత' సినిమాలోని 'ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో' అనే పాటను రీమిక్స్ చేశారు. ఈ రీమిక్స్ వీడియోలో అచ్చం శోభన్ బాబు, శ్రీదేవి వలె వరుణ్ తేజ్, పూజా హెగ్డే ఆడిపాడారు. హరీష్ శంకర్ టేకింగ్ జనాలకు బాగా నచ్చేసింది. దీంతో సినిమా విడుదలకు ముందు నుంచే సోషల్ మీడియాలో ఈ సాంగ్ హవా మొదలైంది. ఇక 'గద్దలకొండ గణేష్' సినిమా రిలీజ్ తర్వాత వ్యూస్ పరంగా ఈ సాంగ్ వేగం పుంజుకుంది. వరుణ్ తేజ్, పూజా హెగ్డే ఆట- పాట నేటితరం ప్రేక్షకులను ఫిదా చేసింది. దీంతో నెట్టింట యమ డిమాండ్‌ క్రియేటై ఈ పాట 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడంతో హరీష్ శంకర్ గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేసింది పూజా హెగ్డే. 'పూర్తి ప్రేమతో చేస్తే అది చాలా మందిని చేరుతుందని నాకు నేర్పించినందుకు ధన్యవాదాలు సార్. ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాటను రీమిక్స్ చేయాలనే మీ కల ఇంతటి ఘనత సాధించింది. థాంక్యూ సార్' అని ఆమె పేర్కొంది. ఇక పూజా హెగ్డే చేసిన ఈ ట్వీట్ చూసిన హరీష్ శంకర్.. 'నా శ్రీదేవి' అంటూ మరింత ఆసక్తికరంగా రియాక్ట్ కావడం విశేషం.


By June 16, 2021 at 11:04AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-harish-shankar-attractive-reply-on-pooja-hegde-tweet/articleshow/83564971.cms

No comments