Breaking News

నిజంగా అదో సవాల్.. కానీ కంప్లీట్ చేసేశా! ఇక అదొక్కటే బ్యాలెన్స్.. తమన్నా ఫీలింగ్స్


సీనియర్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తన పని పూర్తి చేశా అంటోంది. నితిన్‌తో కలిసి నటిస్తున్న '' సినిమాలో తన పార్ట్ షూటింగ్ ఫినిష్ చేశానని ఆమె చెబుతోంది. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘అంధాదూన్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న 'మాస్ట్రో' మూవీలో హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్, మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఈ మూవీని రూపొందిస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో యంగ్ యాంకర్ శ్రీముఖి కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో నితిన్ అంధుడిగా కనిపించనుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. ‘అంధాదూన్‌’ సినిమాలో టబు చేసిన పాత్ర ఇప్పుడు తెలుగులో తమన్నా పోషిస్తోంది. అయితే ఈ క్లిష్ట సమయంలో షూటింగ్‌లో పాల్గొనడం సవాల్‌తో కూడిన పనే అయినా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశానని తమన్నా చెప్పింది. ఇక సినిమాని తెరపై చూడటమే బ్యాలెన్స్.. ఇందుకోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ సినిమాపై హైప్ పెంచేసింది మిల్కీ బ్యూటీ. మరోవైపు ఈ సినిమాలో తమన్నా రోల్ మేజర్ అట్రాక్షన్ కానుందని తెలుస్తుండటం ఆమె అభిమానుల్లో ఆతృత పెంచేసింది. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.


By June 16, 2021 at 11:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/milky-beauty-tamannaah-finished-her-part-in-nithiins-maestro/articleshow/83565660.cms

No comments