ఆ డ్రెస్సులో చూసి ఫిక్సయ్యారట.. అసలు విషయం చెప్పిన ప్రియమణి


సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశం ఎలా వస్తుందో చెప్పలేం.వచ్చిన అవకాశం ఎలా మిస్ అవుతుందో కూడా చెప్పలేం. అలా ప్రియమణికి ఎన్నో సార్లు వచ్చిన అవకాశం మిస్ కాగా చివరకు తననే వెతుక్కుంటూ ఆ చాన్స్ వచ్చేసిందట. ప్రస్తుతం హవా జాతీయస్థాయిలో ఉంది. ఆమె పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సీజన్2తో ప్రియమణి రచ్చ చేశారు. అయితే ప్రియమణి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా మారిపోయారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రియమణికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఇక బుల్లితెరపైనా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోన్నారు. అయితే తాజాగా ప్రియమణి మీడియాతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలను చెప్పుకొచ్చారు. ఆ పాత్ర తనకు ఎలా వచ్చిందో వివరించారు. వెంకటేశ్‌‌తో గతంలో మూడు నాలుగు సినిమాల్లో అవకాశం వచ్చింది కానీ కుదరలేదట. అయితే ‘నారప్ప’కి కుదిరిందని ప్రియమణి అన్నారు. ‘ఈ సినిమాకి మనం పని చేయాలని రాసి పెట్టి ఉందేమో’ అని వెంకీ సార్‌ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించిందని ప్రియమణి తెలిపారు. శ్రీకాంత్‌ అడ్డాల, శ్యామ్‌ కె. నాయుడు లుక్‌ టెస్ట్‌ చేస్తున్నప్పుడే నక్సలైట్‌ డ్రెస్‌లో ఉన్న నన్ను చూసి ‘లుక్స్‌ బాగున్నాయి.. మీరు ఈ పాత్ర చేయొచ్చు.. మేము ఫిక్స్‌ అయ్యాం’ అనడంతో ధైర్యం వచ్చిందట. నారప్ప సినిమాలో తన పాత్ర అనంతపురం యాసలో మాట్లాడుతుందని.. ఈ చిత్రం కోసం మూడు రోజుల్లో సొంతంగా డబ్బింగ్‌ చెప్పానని ప్రియమణి తెలిపారు. ‘విరాటపర్వం’లో భారతక్క అనే నక్సలైట్‌ పాత్ర. ‘సైనైడ్, కొటేషన్‌ గ్యాంగ్‌’ అనే సినిమాలతోపాటు హిందీ ‘మైదాన్‌’లో హీరో అజయ్‌ దేవగన్‌ భార్యగా నటిస్తున్నానని తన ప్రాజెక్ట్‌ల గురించి ప్రియమణి తెలిపారు.


By June 13, 2021 at 12:47PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/priyamani-about-narappa-venkatesh-character-look-test/articleshow/83479062.cms

No comments