Breaking News

యూపీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తుపై జోరుగా ప్రచారం.. మాయవతి క్లారిటీ


వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీచేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి స్పష్టం చేశారు. అసదుద్దీన్ పార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటుందంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి మాయావతి తెరదించారు. పంజాబ్‌లో కేవలం శిరోమణి అకాలీ దళ్‌తోనే పొత్తు ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు మాయావతి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో ఎవరితోనూ పొత్తు ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. ఇక, పంజాబ్‌లో ఇప్పటికే బీఎస్పీ, ఎస్ఏడీ మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందం ఖరారయ్యింది. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఎస్ఏడీ 97, బీఎస్పీ 20 స్థానాల్లో పోటీచేయనున్నాయి. ‘‘ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో , బీఎస్పీ కూటమిగా ఏర్పడి పోటీచేయనున్నాయని మీడియాలో నిన్నటి నుంచి తెగ ప్రచారం జరుగుతోంది.. ఇందులో నిజంలేదు.. పూర్తి నిరాధారమైన తప్పుడు సమాచారం.. ఈ విషయం మరోసారి స్పష్టంగా చెబుతున్నాను.. పంజాబ్ తప్ప వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో పొత్తు ఉండబోదు.. ఒంటరిగా పోటీ చేస్తాం’’ అని ట్వీట్ చేశారు. గతేడాది తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్‌ను కలిశారని, ఇతర పార్టీల నుంచి పనికిరాని నేతలను ఎస్పీలో చేర్చుకుంటున్నారని మాయావతి ఇటీవల వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాయావతి మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఎస్పీలతో పొత్తు పొట్టుకోబోమని, చిన్న పార్టీలతో కలిసి వెళ్తామని అన్నారు. యూపీలో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని అఖిలేష్ యాదవ్ అన్నారు. 2017 ఎన్నికల్లో వారితో పొత్తుపెట్టుకుని 100కిపైగా సీట్లను ఇచ్చాం.. కానీ గెలవలేకపోయాం... యూపీ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు అని అన్నారు. కేవలం ఒక్క స్థానంలోనే కాంగ్రెస్ గెలిచింది.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సోనియా మాత్రం విజయం సాధించారు. కంచుకోట అమేథిలో రాహుల్ గాంధీ ఓటమి చవిచూశారు.


By June 27, 2021 at 01:23PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bsp-to-fight-alone-in-uttar-pradesh-and-uttarakhand-polls-says-mayawati/articleshow/83889946.cms

No comments