అక్కినేని కోడలి న్యూ స్టెప్.. వినూత్నంగా ఆలోచించి ఆ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న సమంత!
స్టార్ హీరోయిన్ సినిమాలతో పాటు ఇతర రంగాలపై కూడా ఫోకస్ చేస్తూ ఆల్ రౌండ్ ప్రతిభ చూపుతోంది. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ చేస్తూ యువ మహిళా వ్యాపారవేత్తగా అడుగులేస్తోంది. అక్కినేని వారింట అడుగుపెట్టాక వినూత్న ఆలోచనలతో దూసుకుపోతోంది. ఇప్పటికే 'సాకీ' పేరుతో ఓ ఫ్యాషన్ వరల్డ్ స్థాపించిన ఆమె.. చిన్న పిల్లల కోసం సర్వ హంగులతో 'ఏకం' ప్రీ స్కూల్ కూడా స్టార్ట్ చేసింది. వీటితో పాటు మరో బిజినెస్‌పై ఫోకస్ పెట్టిన సామ్, అతి త్వరలో ఆ బిజినెస్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే సమంత ప్రారంభించిన వ్యాపారాలు సక్సెస్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. కరోనా కష్టకాలం లోనూ ఆన్‌లైన్ ద్వారా విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ అందుకుంటోందంటే 'సాకి' విజయం సాధించినట్లే అని అర్థమవుతోంది. దీంతో తనకు బిజినెస్ బాగా కలిసొస్తుందని భావిస్తున్న సామ్.. ఇప్పుడు జ్యువెలరీ బిజెనెస్‌లోకి అడుగు పెట్టడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వస్తుందని అంటున్నారు. రీసెంట్‌గా 'ఫ్యామిలీమెన్-2' సిరీస్‌తో ఆకట్టుకొని భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న సమంత.. ప్రస్తుతం శాకుంతలం, కాతువకుల రెండు కాదల్ అనే సినిమాల్లో భాగమవుతోంది. 'శాకుంతలం' సినిమాను గుణశేఖర్ రూపొందిస్తున్నారు. సమంత కెరీర్‌లో ఇదే తొలి పౌరాణిక సినిమా కానుడటం విశేషం. సో.. పెళ్లి తర్వాత సినిమాల పరంగానే కాదు వ్యాపారంలో కూడా ఈ అక్కినేని కోడలి సత్తా చాటుతోందని చెప్పుకోవచ్చు.
By June 21, 2021 at 12:20PM
No comments