Breaking News

బ్లాకీ అన్నారు.. అలా చూసి ఆంటీ అంటూ రెచ్చిపోయారు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ప్రియమణి


హాట్ అండ్ సీనియర్ హీరోయిన్ ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఏదో ఒక కోణంలో ఆమెకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకానొక సమయంలో తన అందాలతో వెండితెరను తడిపేసిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకున్నాక సినిమాలకు కాస్త దూరంగా ఉండి రీసెంట్‌గా మళ్ళీ కెమెరా ముందుకొచ్చింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు బయటపెడుతూ ఓపెన్ అయింది ప్రియమణి. సోషల్ మీడియా హవా రోజురోజుకూ విస్తృతమవుతుండటం సెలబ్రిటీలకు బాగా ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు. తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ఇదో అస్త్రంగా తయారైంది. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో నెటిజన్ల నుంచి తీవ్రమైన ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటున్నారు నటీనటులు. తన విషయంలోనూ ఇదే జరిగిందని అంటోంది ప్రియమణి. ఈ మేరకు తనపై జరిగిన సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి ఆమె కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత తాను కాస్త బరువు పెరిగిన మాట వాస్తవమే గానీ.. అది చూసి అందరూ తనను అంటూ, బ్లాకీ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేసేవారని ప్రియమణి చెప్పింది. నువ్వు లావుగా ఉన్నావ్.. బోండాం అంటూ కొందరు రెచ్చిపోవడం చూశానని చెప్పుకొచ్చింది. దీంతో ఛాలెంజింగ్‌గా తీసుకొని క‌ష్ట‌ప‌డి బ‌రువు త‌గ్గానని ఆమె తెలిపింది. అయితే అప్పుడలా అన్నవాళ్ళే ఇప్పుడు సన్నగా అయ్యావని చెబుతున్నారని.. అయినా వేరొకరి శరీరం గురించి కామెంట్ చేసేందుకు వాళ్లకేం హక్కు ఉందంటూ ట్రోలర్స్‌పై ఘాటుగా రియాక్ట్ అయింది ప్రియమణి. ప్రస్తుతం న్యూ లుక్‌లో బుల్లితెరపై తెగ హంగామా చేస్తున్న ప్రియమణి.. మరికొద్ది రోజుల్లో వెండితెరపై కనిపించబోతోంది. వెంకటేష్ సరసన ఆమె నటించిన 'నారప్ప' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే రానాతో కలిసి నటించిన 'విరాట పర్వం' మూవీ కూడా రిలీజ్‌కి రెడీ అవుతోంది.


By June 14, 2021 at 10:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/priyamani-reacted-about-her-skin-colour-and-body-shaming/articleshow/83502036.cms

No comments