సినిమా రౌండప్: ఆలోచనే లేదన్న సమంత.. అదే బాటలో నితిన్.. భయంకరమైన మహిళ ఆమె!
రాధికా ఆప్టే సెకండ్ డోస్ హీరోయిన్ రాధికా ఆప్టే ప్రస్తుతం లండన్‌లో ఉంది. అక్కడే కొవిడ్ -19 రెండో డోసు టీకా వేయించుకున్న ఆమె.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పింది. నెల రోజుల క్రితం మొదటి డోస్ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నానని, ఇప్పుడు రెండవ డోస్ కూడా పూర్తయిందని చెప్పింది. అంతిస్తా అన్నా కాదన్న సమంత ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వారు 'బాహుబలి- బిఫోర్ ది బిగినింగ్'ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. 'బాహుబలి'కి ప్రీక్వెల్‌గా ఇది రాబోతోంది. ఇందులో నటించేందుకు సమంతను సంప్రదించి భారీ ఆఫర్ ఇచ్చారట. కానీ ఆమె 'నో' చెప్పినట్టు తెలుస్తోంది. రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రలో తను నటిస్తే చాలా విషయాలలో ప్రేక్షకులు పోల్చుకుంటారని.. అది తనకు మైనస్ అయ్యే అవకాశం ఉందనే కారణంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. నితిన్‌దీ అదే బాట క్రమంగా ఓటీటీల హవా పెరుగుతూ వస్తోంది. థియేటర్స్ మూతపడటంతో చాలామంది స్టార్స్ ఓటీటీల బాట పట్టారు. ఇప్పుడు నితిన్, నభా నటేష్ జంటగా తెరకెక్కిన ‘మాస్ట్రో’ కూడా అదే బాట పట్టిందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఇచ్చిన భారీ ఆఫర్ పరిశీలనలో పెట్టారట మేకర్స్. ఆగస్టు నాటికి థియేటర్లు గాడిన పడినట్లయితే థియేటర్లలోకి తీసుకురావాలని, లేదంటే ఓటీటీకి తీసుకెళ్లాలని సన్నాహాలు చేస్తున్నారట. కృతి సనన్ ఫిక్స్ హాలీవుడ్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ ‘కిల్ బిల్’ హిందీ రీమేక్‌లో నటించే అవకాశం కృతి సనన్‌కి దక్కిందట. పగ, ప్రతీకారం తీర్చుకుంటూ హంతకులపై పగబట్టిన భయంకరమైన మహిళగా ఆమె కనిపించనుందట. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌లో ఆమె శిక్షణ తీసుకుంటోందని సమాచారం. అదా శర్మ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ నిర్మించబోయే వెబ్ సిరీస్‌లో నటించనుందట 'హార్ట్ ఎటాక్' బ్యూటీ అదా శర్మ. ఫీమేల్ లీడ్ కథ, ఆసక్తికర సన్నివేశాలతో రూపొందే ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుందని సమాచారం.
By June 23, 2021 at 08:42AM
No comments