దగ్గరలో ఆషాడ మాసం.. అందుకే రహస్యంగా కానిచ్చేశాం.. మ్యారేజ్ సీక్రెట్స్ బయటపెట్టిన ప్రణీత
లాక్ డౌన్ వేళ చాలా మంది సినీ తారలు పెళ్లి పీటలెక్కారు. ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఒక్కొక్కరుగా పెళ్లి బాట పట్టారు. ఎంతో ఆడంబరంగా చేసుకోవాల్సిన పెళ్లి వేడుకను లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ నిరాడంబరంగా పూర్తి చేశారు. ఈ లిస్టులో హీరోయిన్ ఒకరు. కరోనా విలయతాండవంలో పేదలకు అండగా నిలుస్తూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె.. ఇటీవలే తన పెళ్లి తంతు ఫినిష్ చేసి సడెన్ షాకిచ్చింది. తన చిన్ననాటి స్నేహితుడు, బెంగళూరు వ్యాపారవేత్త నితిన్ రాజును మే 31న ఆమె రహస్య వివాహం చేసుకుంది. అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెంగుళూరులో ఈ వివాహ వేడుక జరిగింది. వివాహానికి హాజరైన ఓ స్నేహితుడు పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో ఉన్నట్టుండి సడెన్‌గా పీటలెక్కడం చూసి ప్రతీఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తొలిసారి స్పందిస్తూ.. తన మ్యారేజ్ సీక్రెట్స్ బయటపెట్టింది ప్రణీత. రీసెంట్‌గా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయమై ప్రణీత రియాక్ట్ అయింది. కరోనా పరిస్థితులు, దగ్గరలో ఆషాడ మాసం ఉండటం వల్ల నిరాడంబరంగా తన పెళ్లి తంతును జరపాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. సినీ పెద్దలు, సన్నితులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక నిర్వహించుకోవాలని అనుకున్నాం కానీ.. ఈ విపత్కర సమయంలో అలా పెళ్లి చేసుకోవడం సరికాదని భావించి కొద్దిమంది బంధువుల సమక్షంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పెళ్లి వేడుక పూర్తి చేశామని ప్రణీత చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రణీత.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన ‘హంగామా-2’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
By June 16, 2021 at 07:38AM
No comments