Breaking News

Bill Gatesకు మరో షాక్.. ఫౌండేషన్ నుంచి తప్పుకున్న ప్రపంచ కుబేరుడు బఫెట్!


బిల్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ పదవి నుంచి వైదొలగుతూ ప్రపంచ కుబేరుడు వారెన్‌ బఫెట్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బిల్‌ గేట్స్‌ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన కొద్దిరోజులకే బఫెట్‌ నుంచి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గేట్స్ ఫౌండేషన్‌ ట్రస్టీగా కొనసాగుతున్నప్పటికీ.. క్రియాశీలంగా లేనని, తన పదవికి రాజీనామా చేస్తున్నానని బఫెట్‌ బుధవారం ఓ ప్రకటన చేశారు. అలాగే తన సంస్థ బర్క్‌షైర్‌ హాత్‌వే షేర్లను నూరు శాతం సేవా కార్యక్రమాలకు వినియోగించాలన్న తన లక్ష్యం ఇప్పటికే సగం పూర్తయ్యిందని బఫెట్ తెలిపారు. అయితే, ట్రస్టీగా వైదొలగడానికి గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ముగ్గుర సభ్యుల బోర్డులో బిల్‌గేట్స్‌, మెలిండాతో పాటు వారెన్ బఫెట్‌ ఒకరు. గత 15 ఏళ్లలో దాదాపు 27 బిలియన్‌ డాలర్లను బిల్‌మిలిండా ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలకు వెచ్చించారు. ఫౌండేషన్ దీర్ఘకాలిక మనుగడ, సుస్థిర గురించి ఉద్యోగులతో వారెన్ బఫేట్ గత నెలలో చర్చించినట్టు ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్మాన్ తెలిపారు. కాగా, సీఈఓగా సుజ్మాన్ ఎంపికకు తన పూర్తి మద్దతు ఉంటుందని బఫేట్ తెలిపారు. గేట్స్ ఫౌండేషన్‌ బోర్డులో కేవలం ముగ్గురు సభ్యులే ఉండగా.. దీనిలో ఐదో వంతు ఉండే ఫోర్డ్ ఫౌండేషన్‌ బోర్డులో 15 మంది, పదో వంతు ఉండే రాక్ఫెల్లర్ ఫౌండేషన్‌లో12 కంటే ఎక్కువ మంది సభ్యులంటారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని సుజ్మాన్ గత నెలలో వెల్లడించారు. అయితే ‘, మిలిండాలు ఫౌండేషన్ పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.. మా మిషన్ తరపున కలిసి పనిచేయడం కొనసాగిస్తారు’ అని అన్నారు. ఇక, వారెన్ బఫెట్, బిల్ గేట్స్ చిరకాల మిత్రులు. బర్క్‌షైర్ బోర్డులో సభ్యుడిగానూ ఉన్న గేట్స్... గతేడాది తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. గేట్స్ ఫౌండేషన్‌కు తన సంపదను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు 2006లో ప్రకటించారు. అయితే, వారెన్ బఫెట్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో దాతృత్వం ద్వారా పొందిన పన్ను మినహాయింపులను కూడా ప్రస్తావించారు. ఇటీవల పన్ను చెల్లింపుల్లో బఫెట్‌పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రోపబ్లికా అంతర్గత రెవెన్యూ సర్వీస్ డేటా ఆధారంగా చేపట్టిన దర్యాప్తు ప్రకారం... ఐదు ఫౌండేషన్లనకు 41 బిలియన్ డాలర్లు విరాళాలుగా ఇచ్చి 1,000 డాలర్లకు 40 సెంట్ల చొప్పు పన్ను ఆదా మాత్రమే చేశామని బఫెట్ పునరుద్ఘాటించారు. నా వ్యక్తిగత ఆదాయం కూడా తక్కువగానే ఉందని తెలిపారు. ‘బెర్క్‌షైర్ స్టాక్‌హోల్డింగ్స్ పన్ను చెల్లించే వ్యాపారాలలో పూర్తిగా నిమగ్నమై ఉంది.. క్రమం తప్పకుండా ఉత్పత్తి, ఉపాధి, ఆదాయాలను మరింతగా పెంచుకోవడానికి తిరిగి పెట్టుబడి పెడుతుంది. ఇతర ఆస్తుల నుంచి నేను పొందే ఆదాయం నేను కోరుకున్నట్లుగా జీవించడానికి సహకరిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.


By June 24, 2021 at 07:59AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/billionaire-warren-buffett-resigns-as-trustee-of-bill-and-melinda-gates-foundation/articleshow/83798030.cms

No comments