Breaking News

ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 15 మధ్య ఆప్షనల్ పరీక్షలు.. సుప్రీంలో CBSE అఫిడ్‌విట్


కరోనా నేపథ్యంలో 12 తరగతి పరీక్షలను రద్దుచేసిన సీబీఎస్‌ఈ.. ఎవరైనా పరీక్షలు రాయాలనుకుంటే వారికి అవకాశం కల్పించనుంది. ఆప్షనల్ పరీక్షలను ఆగస్ట్‌ 15 నుంచి సెప్టెంబర్‌ 15 మధ్య నిర్వహించనున్నట్టు బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. సోమవారం దీనికి సంబంధించి అదనపు అఫిడవిట్‌ను సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసింది. మార్కింగ్‌ వ్యవస్థ ద్వారా తుది మార్కులను లెక్కించే విధానంపై వివాదాలు తలెత్తుతాయని, దీనికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని సీబీఎస్‌ఈ వివరించింది. తుది ఫలితాలను జులై 31న విడుదల చేస్తామని స్పష్టం చేసింది. పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఆన్‌లైర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. కరోనా తగ్గుముఖంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపిది. బోర్డు ప్రకటించే ఫలితాలపై అసంతృప్తిగా ఉన్న విద్యార్థులు ఈ ఆప్షనల్‌ ఎగ్జామ్స్‌ రాసే అవకాశం కల్పిస్తోంది. పరీక్షలను రద్దుచేసి 10,11వ తరగతి మార్కుల ఆధారంగా 12వ తరగతి మార్కులు ఇవ్వనుంది. 30:30:40 ఫార్ములా ఆధారంగా ఫలితాలు విడుదల ప్రకటించనున్నారు. అయితే, ఆప్షనల్‌ ఎగ్జామ్స్‌ ఎంచుకున్నవారికి రాత పరీక్షలో వచ్చే మార్కులే తుది ఫలితంగా పరిగణిస్తారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఏవైనా అభ్యంతరాలు ఉంటే విద్యార్థులు ఫిర్యాదుల పరిష్కార కమిటీని సంప్రదించవచ్చు. ‘12 వ తరగతి పరీక్షల మార్కుల పట్టిక విధానం సీబీఎస్‌ఈ రూపొందించడం వల్ల ప్రామాణీకతను నిర్ధారించడానికి ప్రతి పాఠశాల విశ్వసనీయమైన ప్రమాణాలను ఉపయోగించి, వ్యత్యాసాలను లెక్కించడానికి అంతర్గతంగా మార్కులను వేయాలి.. ఈ మార్కులు విద్యార్థుల ప్రమాణానికి సరిపోయేవని నిర్ధారించేలా ఉండాలి.. ఏ విద్యార్థికి ప్రతికూల ప్రభావం లేదా అనవసరమైన లబ్ది చేకూరేలా ఉండకూడదు’ అని పేర్కొంది. పరీక్షలను రద్దుచేయడాన్ని కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనా తగ్గుముఖం పడుతున్నందున పరీక్షలను నిర్వహించాలని కోరారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం విచారించనుంది. అలాగే, పలు రాష్ట్రాల బోర్డులు పరీక్షలను రద్దుచేయాలని దాఖలైన పిటిషన్లపై మంగళవారం తుది విచారణ జరగనుంది.


By June 22, 2021 at 07:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/optional-class-12-board-exams-from-aug-15-sept-15-cbse-to-supreme-court/articleshow/83735389.cms

No comments