Breaking News

Ulhasnagar Incident భవనం కూలి ఏడుగురు మృతి.. శిథిలాల కింద మరింత మంది


నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. థానే జిల్లా ఉల్హాస్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నెహ్రూ చౌక వద్ద ఐదంతస్తుల భవంతి కుప్పకూలినట్టు అధికారులు తెలిపారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో సాయి సిద్ధి ఐదంతస్తుల భవనం స్లాబ్ కూలిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి అక్కడ ఎంత మంది ఉన్నారనేది స్పష్టత లేదు. ఇప్పటి వరకూ ఏడు మృతదేహాలను వెలికితీయగా.. నలుగురు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదవశాత్తు ఈ భవనం కూలినట్టు తెలుస్తోంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్టు అధికారు భావిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవంతి శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీశారు. వీరిలో ఏడుగురు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు ఐదుగురు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిర్మాణపరంగా నిబంధనలు ఉల్లంఘించడంతోనే ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. కాగా, పది రోజుల వ్యవధిలో ఈ నగరంలో జరిగిన రెండో ఘటన ఇది. మే 15న ఉల్హాస్‌నగర్ క్యాంప్‌లోని మోహిని ప్యాలెస్ భవనం కూటి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. గతేడాది థానె జిల్లా భీవండిలో మూడంతస్తుల భవనం కూలి దాదాపు 50 మంది చనిపోయారు. భివాండీ పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో 43 ఏళ్ల కిందట నిర్మించిన జిలానీ భవనం కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో తరుచూ ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి.


By May 29, 2021 at 09:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/seven-dead-several-feared-trapped-building-collapses-in-maharashtras-thane/articleshow/83055610.cms

No comments