Breaking News

ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.. RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు


దేశంలో నెలకున్న కరోనా సంక్షోభంపై చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌-19 తొలిదశ వ్యాప్తి తర్వాత దేశంలోని అన్ని వర్గాల్లోనూ నిర్లక్ష్యం పెరిగిపోయిందని, అదే ప్రస్తుత దుస్థితికి కారణమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేశాయని పరోక్షంగా మోదీపై విమర్శలు గుప్పించారు. ‘పాజిటివిటీ అన్‌లిమిటెడ్‌’ పేరిట నిర్వహించిన ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భగవంత్ శనివారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితికి నిర్లక్ష్యమే కారణమన్నారు. ‘‘మొదటి దశ విజృంభణ తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయింది. ప్రజలు, ప్రభుత్వాలు, పాలనా యంత్రాంగం.. ఇలా అందరిలోనూ అదే ధోరణి. రెండో దశ వ్యాప్తి వస్తుందని మనకు తెలుసు. ఈ విషయమైన వైద్యులూ హెచ్చరించినా మన పద్ధతి మారలేదు’’ అని అన్నారు. అయితే సంక్షోభ సమయంలో ఒకరినొకరు విమర్శించుకోడానికి బదులు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనాపై పోరులో ప్రజలు సానుకూల ధోరణితో, చురుగ్గా వ్యవహరించాలని కోరారు. కొవిడ్‌ ‘నెగిటివ్‌’గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా మూడో వేవ్ కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. కాబట్టి మనం భయపడాలా? లేదా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడి గెలవడానికి సరైన వైఖరి ఉందా? అని భగవత్ ప్రశ్నించారు. ప్రస్తుత అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకుని భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా ప్రజలు, ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటకు వచ్చి మూడో వేవ్‌ను ఎదుర్కొడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అన్నారు. ‘‘చావు పుట్టుకలు నిరంతర ప్రక్రియ.. ఈ విషయాలు మనల్ని భయపెట్టలేవు... కానీ, ఈ పరిస్థితులే భవిష్యత్తు కోసం మనకు అనుభవాన్ని నేర్పుతాయి.. విజయం అంతిమమైనది కాదు. వైఫల్యం ప్రాణాంతకం కాదు. ఈ దశలో ధైర్యంతో కొనసాగడం మాత్రమే ముఖ్యమైనది’’ అని పేర్కొన్నారు. మరోవైపు కొవిడ్‌పై పోరు అంశంలో ప్రభుత్వం మరింత పారదర్శకంగా ఉండాలని ఆరెస్సెస్‌ సీనియర్‌ నేత, బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ సూచించారు. ‘పాజిటివిటీ అన్‌లిమిటెడ్‌’ పేరిట మే 11 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.


By May 16, 2021 at 09:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rss-chief-mohan-bhagwat-sensational-comments-on-covid-situation-and-government/articleshow/82674986.cms

No comments