Breaking News

Regn-Cov 2 దేశంలో ట్రంప్ వాడిన వండర్ డ్రగ్.. ఒక్కో డోసు రూ. 60వేలు!


అమెరికా మాజీ అధ్యక్షుడు గతేడాది ఎన్నికల ముందు కరోనా బారినపడినప్పుడు వాడిన ఔషధం మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌‌కు భారత్ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఔషధం దేశంలో అందుబాటులోకి రాగా... తొలి బ్యాచ్‌లో లక్ష ప్యాక్‌లు విడుదల చేశారు. ఇవి ప్రముఖ ఆస్పత్రుల్లో, కొవిడ్‌ చికిత్సా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. కాగా, 1200 ఎంజీ (కాసిరివిమాబ్‌ 600 mg, ఇండెవిమాబ్‌ 600 mg రెండూ కలిపి 1.2gms) ఉండే ఒక్కో డోసు ధర రూ. 59,750గా నిర్ణయించారు. రెండు డోస్‌లున్న ఒక్కో ప్యాక్‌ అన్ని పన్నులతో కలుపుకుని రూ.1,19,500. దీనిని ఇద్దరికి చికిత్సకు వినియోగించవచ్చు. రెండో బ్యాచ్‌ జూన్‌ రెండోవారంలో కి అందుబాటులోకి రానున్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌నకు కోవిడ్ పాజిటివ్‌ నిర్ధారణ అయినప్పుడు ప్రయోగాత్మకంగా మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను వాడారు. ఈ ఔషధం తీసుకున్న నాలుగు రోజుల్లోనే కోలుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్లగలిగారు. దీంతో ఈ ఔషధంపై ప్రపంచానికి ఆసక్తి పెరిగింది. కరోనా సోకి అధిక ముప్పు ఉన్నవారి పరిస్థితి ఆక్సిజన్‌ పెట్టే దాకా రాకముందే ఈ ఔషధాన్ని ఇవ్వడం వల్ల ఆస్పత్రిలో చేరే ప్రమాదం, మరణించే ముప్పు 70 శాతం తగ్గుతున్నట్టు క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడయ్యింది. 12 ఏళ్లు దాటినవారికి, కనీసం 40 కిలోల బరువున్నవారికి ఈ మందు వాడొచ్చు. ఆక్సిజన్‌ అవసరమైనవారికి మాత్రం ఆ దశలో ఈ ఔషధం వాడకూడదని అమెరికా ఎఫ్‌డీయే స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన రీజనరాన్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఈ ఔషధాన్ని విదేశాల్లో ఉత్పత్తికి స్విట్జర్లాండ్‌కు చెందిన రోచె సంస్థ అనుమతి పొందింది. ఆ సంస్థ భారత్‌లో సిప్లా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘‘కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి, రెండో దశ ఉద్ధృతిని తగ్గించి, ప్రాణాలను కాపాడటానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి రోచె కట్టుబడి ఉంది.. భారత్‌లో (కాసిరివిమాబ్, ఇండెవిమాబ్) లభ్యత ఆసుపత్రిలో చేరే ప్రమాదం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారాన్ని తగ్గించడానికి.. అధిక ముప్పు ఎదుర్కొనే రోగుల పరిస్థితి మరింత దిగజారడానికి ముందే చికిత్స చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని మేము అశిస్తున్నాం’’ రోచె ఫార్మ ఇండియా ఎండీ సింప్సన్ ఇమ్మాన్యుయేల్ అన్నారు. కాసిరివిమాబ్‌, ఇమ్‌డెవిమాబ్‌ అనే రెండు రకాల మోనోక్లోనల్‌ యాంటీబాడీల మిశ్రమం. వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ వాటితో సమర్థంగా పోరాడే యాంటీబాడీలను ఇది తయారుచేస్తుంది. అలాంటి యాంటీబాడీలను ప్రయోగశాలలో తయారుచేస్తే ఆ ప్రొటీన్లను మోనోక్లోనల్‌ యాంటీబాడీలుగా వ్యవహరిస్తారు. వైరస్‌లో కొత్త మ్యుటేషన్ల ముప్పును ఎదుర్కొనేందుకే రెండూ కలిపి ఇవ్వాలని పరిశోధకులు చెబుతున్నారు. అయితే.. కొత్త వేరియంట్స్ స్పైక్‌ డిలీషన్స్‌ చేసుకుంటున్నాయని.. ఈ ఔషధం యాంటీబాడీలు స్పైక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి కాబట్టి అంతగా ప్రభావం చూపకపోవచ్చని గ్లోబల్‌ హెల్త్‌ చారిటీ ‘వెల్‌కమ్‌ ట్రస్ట్‌’కు చెందిన నిక్‌ కామక్‌ అన్నారు.


By May 25, 2021 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/roches-covid-antibody-cocktail-per-dose-rs-60k-in-india/articleshow/82930028.cms

No comments