Breaking News

Covidshield doses Gap కోవిషీల్డ్‌పై కేంద్రం కీలక ప్రకటన.. వారికి ఊరట


కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని కేంద్రం ఇటీవల పొడిగించింది. కోవిడ్ వర్కింగ్ గ్రూప్ సూచనలతో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా టీకా రెండు డోస్‌ల మధ్య విరామం 12 నుంచి 16 వారాలకు పెంచించింది. దీంతో రెండో డోస్ కోసం కేంద్రాలకు వెళ్లేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్రం నిర్ణయం ప్రకారం రెండో డోస్‌ కోసం వచ్చినవారిని వెనక్కు పంపుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఆదివారం కీలక ప్రకటన చేసింది. రెండో డోసు కోసం ఇప్పటికే అపాయింట్‌మెంట్‌ తీసుకుంటే చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కొవిన్‌ పోర్టల్‌లో అపాయింట్‌మెంట్‌‌ను రద్దు చేయలేదని పేర్కొంది. అయితే, రెండో డోస్ కోసం కొత్తగా అపాయింట్‌మెంట్‌ తీసుకునేవారికి మాత్రం గడువు పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఆ మేరకు కొవిన్‌ పోర్టల్‌లో మార్పులు చేసినట్లు తెలిపింది. కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సూచనలతో కొవిషీల్డ్‌ డోస్‌ల వ్యవధిని 12-16 వారాలకు ఇటీవల కేంద్రం పొడిగించింది. అయితే, ఇదివరకే తీసుకున్న అపాయింట్‌మెంట్లు చెల్లుతాయని, వ్యాక్సిన్‌ కోసం వచ్చిన ఎవర్నీ తిప్పి పంపొద్దని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ మేరకు సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. అలాగే టీకా తీసుకోడానికి ముందుకొచ్చేవారు తొలి డోస్ వేసుకున్న 84 రోజుల తర్వాత వ్యాక్సిన్‌ వేసుకునేలా రీషెడ్యూల్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కోవిషీల్డ్ టీకా రెండు డోస్‌ల మధ్య తొలుత 28 రోజుల విరామం పాటించగా.. ఆ తర్వాత మార్చిలో దీనిని 6 నుంచి 8 వారాలకు పెంచారు. అయితే, మూడోసారి 12 నుంచి 16 వారాలకు పెంచాలని జాతీయ వ్యాధినిరోధక సాంకేతిక సలహా బృందం సూచించింది. కొవాగ్జిన్‌ వ్యవధిలో మాత్రం మాత్రం ఎటువంటి మార్పులను సూచించలేదు. అంతేకాదు, గర్బిణీలు కూడా టీకా వేసుకోవచ్చని, ప్రసవం తర్వాత బాలింతలు కూడా ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపింది.


By May 17, 2021 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/already-booked-for-covishield-second-dose-wont-be-cancelled-centre-clarify/articleshow/82697867.cms

No comments