Breaking News

Covaxin మిస్టరీ : 6 కోట్ల డోసుల్లో వేసింది 2 కోట్లే.! మిగిలినవి ఏమయ్యాయ్? అంతుచిక్కని రహస్యం

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున చేపట్టాయి. ఇటీవల 18 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్రం సూచించింది. కానీ వ్యాక్సిన్ కొరత కారణంగా అందరికీ వ్యాక్సిన్ ఇప్పట్లో సాధ్యం కాదని కొన్ని రాష్ట్రాలు తేల్చి చెప్పేశాయి. ఇప్పటికీ వ్యాక్సిన్ల కొరత వేధిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. దీంతో అసలు వ్యాక్సిన్ డోసుల తయారీ, సరఫరాపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అందులోనూ భారత్ బయోటెక్ తయారుచేస్తున్న కోవాగ్జిన్ సరఫరా అంతుచిక్కని రహస్యంగా మారింది. కంపెనీ చెబుతున్న సామర్థ్యానికి.. దేశంలో ఇప్పటి వరకూ వేసిన కోవాగ్జిన్ డోసులకు అసలు పొంతన కుదరడం లేదు. సుమారు 6 కోట్ల కోవాగ్జిన్ డోసులు సరఫరా చేసినట్లు ఓ వైపు కంపెనీ.. మరోవైపు కేంద్రం చెబుతుంటే.. వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య మాత్రం కేవలం 2.1 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.

దేశంలో కోవాగ్జిన్ కొరత తీవ్రంగా ఉంది. ఒక డోసు వేయించుకున్న వారు రెండో డోసు కోసం పడిగాపులు కాస్తున్నారు. కంపెనీ లెక్కల ప్రకారం 6 కోట్ల డోసులు జనబాహుళ్యంలోని వచ్చాయి. కానీ ఇప్పటి వరకూ కేవలం 2.1 కోట్ల మందికి మాత్రమే కోవ్యాగ్జిన్ వేశారు. మిగిలినవి.?

Covaxin మిస్టరీ : 6 కోట్ల డోసుల్లో వేసింది 2 కోట్లే.! మిగిలినవి ఏమయ్యాయ్? అంతుచిక్కని రహస్యం

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున చేపట్టాయి. ఇటీవల 18 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్రం సూచించింది. కానీ వ్యాక్సిన్ కొరత కారణంగా అందరికీ వ్యాక్సిన్ ఇప్పట్లో సాధ్యం కాదని కొన్ని రాష్ట్రాలు తేల్చి చెప్పేశాయి. ఇప్పటికీ వ్యాక్సిన్ల కొరత వేధిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. దీంతో అసలు వ్యాక్సిన్ డోసుల తయారీ, సరఫరాపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అందులోనూ భారత్ బయోటెక్ తయారుచేస్తున్న కోవాగ్జిన్ సరఫరా అంతుచిక్కని రహస్యంగా మారింది. కంపెనీ చెబుతున్న సామర్థ్యానికి.. దేశంలో ఇప్పటి వరకూ వేసిన కోవాగ్జిన్ డోసులకు అసలు పొంతన కుదరడం లేదు. సుమారు 6 కోట్ల కోవాగ్జిన్ డోసులు సరఫరా చేసినట్లు ఓ వైపు కంపెనీ.. మరోవైపు కేంద్రం చెబుతుంటే.. వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య మాత్రం కేవలం 2.1 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.

భారత్ బయోటెక్ ఏం చెప్పిందంటే.!
భారత్ బయోటెక్ ఏం చెప్పిందంటే.!

భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా.. గత నెల 20న మాట్లాడుతూ మార్చి, ఏప్రిల్ నెలల్లో 15 మిలియన్ డోసులు(1.5 కోట్లు) ఉత్పత్తి చేశామని.. నెల చివరి నాటికి 20 మిలియన్ డోసుల(2 కోట్లు)కు చేరుకుంటామన్నారు. ఆయన లెక్క ప్రకారం మార్చి, ఏప్రిల్ నెలల్లో కనిష్టంగా 3 మిలియన్(3 కోట్లు) డోసులు ఉత్పత్తి చేసినట్టు అర్థమవుతోంది. ఏప్రిల్ చివరి నాటికి 20 మిలియన్ డోసులు ఉత్పత్తి చేసి ఉంటే ఆ సంఖ్య 35 మిలియన్(3.5 కోట్లు) డోసులకు చేరుతుంది. మే నెలలో మరో 20 మిలియన్ డోసులు(2 కోట్లు) ఉత్పత్తి చేసి ఉంటుందని అంచనా. మొత్తం 5.5 కోట్ల డోసులు.

కేంద్రం అఫిడవిట్‌లో..
కేంద్రం అఫిడవిట్‌లో..

మరోవైపు కేంద్రం చెబుతున్న లెక్కలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. వ్యాక్సిన్ల తయారీ సామర్థ్యంపై సుప్రీం కోర్టు, కేరళ హైకోర్టులో కేంద్రం సమర్పించిన అఫిడవిట్లలో కూడా అదే విషయం తేటతెల్లమవుతోంది. నెలకు 2 కోట్ల డోసుల కోవాగ్జిన్ ఉత్పత్తి అవుతోందని.. మే చివరి నాటికి 5.5 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్రం తన అఫిడవిట్లలో పేర్కొంది. భారత్ బయోటెక్ చెప్పిన లెక్కలకు అనుగుణంగానే కేంద్రం కోర్టుకి చెప్పిన సంఖ్యలు కూడా ఉన్నాయి.

సుమారు 8 కోట్ల డోసుల ఉత్పత్తి!
సుమారు 8 కోట్ల డోసుల ఉత్పత్తి!

వ్యాక్సినేషన్ డ్రైవ్‌కి ముందు.. జనవరి 5న సీఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ అప్పటికే కంపెనీ వద్ద 20 మిలియన్ డోసులు ఉన్నట్లు చెప్పారు. వాటిని కలుపుకుంటే కంపెనీ ఉత్పత్తి చేసిన డోసుల సంఖ్య సుమారు 7.5 కోట్లు. దానికి జనవరి, ఫిబ్రవరిలో ఉత్పత్తి చేసిన డోసులను కలపాల్సి ఉంటుంది. జనవరి, ఫిబ్రవరిలో ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంది కాబట్టి మొత్తంగా 8 కోట్ల డోసులు ఉత్పత్తి చేసినట్లు అంచనా. విదేశీ దౌత్య విధానాల్లో భాగంగా ఇప్పటి వరకూ భారత్ 6.6 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఎగుమతి చేసింది. వాటిలో సింహభాగం కోవిషీల్డ్. తక్కువలో తక్కువ అనుకున్నా 2 కోట్ల కోవాగ్జిన్ డోసులు దేశం దాటి ఉండొచ్చు.

కేవలం 2.1 కోట్ల డోసులే..
కేవలం 2.1 కోట్ల డోసులే..

ఈ లెక్కల ప్రకారం సుమారు 6 కోట్ల డోసుల కోవాగ్జిన్ దేశంలో అందుబాటులో ఉన్నట్లు అవగతమవుతోంది. కానీ ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కోవ్యాగ్జిన్ డోసులు తీసుకున్న వారి సంఖ్య కేవలం 2.1 కోట్లు మాత్రమే.(గురువారం ఉదయం వరకు గణాంకాలు). కోవాగ్జిన్‌కు తీవ్ర కొరత ఏర్పడిందని.. మొదటి డోసు వేయించుకున్న ప్రజలు రెండో డోసు కోవాగ్జిన్ కోసం ఎదురుచూస్తున్నారని ఢిల్లీ లాంటి రాష్ట్రాలు మొత్తుకుంటున్నాయి. దేశంలో 31 శాతంతో కోవాగ్జిన్ వినియోగంలో ఢిల్లీ తొలిస్థానంలో ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో కోవాగ్జిన్ కొరత తీవ్రం. దేశంలో సుమారు 14 చిన్నరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అసలు కోవాగ్జిన్ చేరనే లేదు. ఒక్క డోసు కూడా కోవాగ్జిన్ వేయలేదు. మరో 5 రాష్ట్రాల్లో కోవాగ్జిన్ వినియోగం 5 శాతం కంటే తక్కువ. మరి సుమారు 6 కోట్ల డోసుల్లో 2.1 కోట్ల మంది మాత్రమే కోవాగ్జిన్ వేసుకుంటే.. మిగిలిన డోసులు ఏమయ్యాయనేది చిదంబర రహస్యంగా మారింది. అదే విషయంపై స్పష్టత తీసుకునేందుకు భారత్ బయోటెక్‌ను సంప్రదించినా సంస్థ ప్రతినిధులెవరూ స్పందించకపోవడం గమనార్హం. ఆ నాలుగు కోట్ల డోసులు ఏమయ్యాయో ఆ దేవుడికే తెలియాలి మరి!!

By May 28, 2021 at 03:02PM

Read More https://telugu.samayam.com/latest-news/india-news/covaxin-mystery-6-crore-shots-ready-2-crore-given-where-the-rest/articleshow/83032702.cms

No comments