Breaking News

సుప్రీంకోర్టుకు చేరిన బెంగాల్ పంచాయతీ.. ఆ ఆదేశాలపై CBI అభ్యంతరం


నారద ముడుపుల కేసులో అరెస్టయిన ఇద్దరు బెంగాల్ మంత్రులు, ఓ ఎమ్మెల్యే సహా నలుగురు నేతలకు గృహనిర్బంధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన .. సుప్రీంకోర్టులో సోమవారం సవాల్ చేసింది. నలుగురు నేతల బెయిల్ పిటిషన్ విషయంలో డివిజన్ బెంచ్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడంతో ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి అప్పగించింది. విస్తృత ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్‌కు రద్దుచేసేలా ధర్మాసనాన్ని ఆదేశించాలని సీబీఐ సుప్రీంకోర్టును కోరింది. ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టనుంది. మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, ఆ పార్టీ మాజీ నేత సోవన్ ఛటర్జీ‌లను గత సోమవారం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోవిడ్-19పై పోరులో కీలకంగా వ్యవహరిస్తోన్న మంత్రి హకీమ్‌ను ఇంటి నుంచి పనిచేయడానికి హైకోర్టు అనుమతించింది. సీబీఐ అరెస్ట్ చేసిన నలుగురికి మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. చీఫ్ జస్టిస్ రాజేశ్ బిందాల్ గృహనిర్బంధం సిఫార్సు చేయగా.. మరో న్యాయమూర్తి జస్టిస్ అరిజిత్ బెనర్జీ బెయిల్‌ ఇవ్వాలని అన్నారు. ఇరువురు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో చివరిగా గృహనిర్బంధం కొనసాగించాలని నిర్ణయించారు. సోమవారం అరెస్టయిన నలుగురిలో మంత్రులకు అదే రోజు మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే, దీనిపై సీబీఐ కలకత్తా హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ రద్దు చేసింది. నిందితులు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించింది. అంతేకాదు, ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీచేయాలిని కోరింది. నలుగురు నేతల అరెస్ట్‌తో బెంగాల్ రాజకీయాలు మరోసారి వెడెక్కాయి. మంత్రులను అరెస్ట్ చేయడంపై సీఎం మమతా బెనర్జీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆమె నేరుగా సీబీఐ కార్యాలయానికి చేరుకుని నిబంధనలు పాటించకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. తనను కూడా అరెస్ట్ చేయాలని సీబీఐకి సవాల్ విసిరారు. నేతల కుటుంబసభ్యులు, పెద్ద ఎత్తున టీఎంసీ నేతలు కూడా చేరుకుని ఆందోళన నిర్వహించారు.


By May 24, 2021 at 12:44PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cbi-challenges-in-supreme-court-west-bengal-ministers-house-arrest/articleshow/82903074.cms

No comments