Breaking News

ఆయన తీరుతో ఇబ్బందిపడ్డా.. డబ్బింగ్‌ థియేటర్‌కి వెళ్లగానే! డైరెక్టర్ బాగోతం బయటపెట్టిన సింగర్ సునీత


టాలీవుడ్ ఫేమస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. ఓ డైరెక్టర్ కారణంగా తాను ఇబ్బంది పడ్డానంటూ ఆమె ఓపెన్ కావడంతో ఈ ఇష్యూ వైరల్ అయింది. ఒకానొక సందర్భంలో డబ్బింగ్ థియేటర్‌లో ఓ డైరెక్టర్ తనతో ప్రవర్తించిన తీరును వెల్లడిస్తూ.. ఆ సంఘటన బాగా ఇబ్బంది పెట్టిందని సునీత చెప్పారు. ఇటీవలే మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సునీత.. ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. భర్తతో హనీమూన్ ట్రిప్స్, పెళ్లి తర్వాత ఆమెపై ట్రోల్స్, ఆ దంపతుల ఇంటర్వ్యూలు ఇలా అన్నీ హైలైట్ అవుతున్నాయి. మరోవైపు తనపై వచ్చిన ట్రోల్స్ ఏవీ పట్టించుకోకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు సునీత. ఈ నేపథ్యంలోనే తాజాగా తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఆమె వివరించారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయిన సునీత.. గతంలో డబ్బింగ్ థియేటర్‌లో ఓ టాలీవుడ్ డైరెక్టర్ మాటలతో ఇబ్బంది పెట్టారంటూ సంచలన విషయాన్ని బయటకు తీశారు. ఓ సినిమాకు డబ్బింగ్‌ చెప్పడానికి స్టూడియోకు వెళితే ఆ చిత్ర దర్శకుడు వ్యవహరించిన తీరు బాలేదని ఆమె అన్నారు. మేడమ్‌ మీకు నేను పెద్ద అభిమానిని.. మీరు మా సినిమాకు డబ్బింగ్‌ చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ మాటలు మొదలుపెట్టిన ఆ డైరెక్టర్.. ఆ తర్వాత కొద్దిసేపటికి సునీత అంటూ పేరుపెట్టి పిలిచారని, అంతటితో ఆగక ఇంకొద్ది సేపయ్యాక అంటే డబ్బింగ్‌ పూర్తయ్యేసరికి అరేయ్‌.. కన్నా.. బుజ్జి లాంటి పదాలు వాడటం చాలా ఇబ్బంది పెట్టిందని సునీత అన్నారు. ఆ సమయంలో ఎలా రియాక్ట్‌ కావాలో తెలియలేదని, మళ్ళీ ఆ డైరెక్టర్‌ని కలవలేదని సునీత చెప్పారు.


By May 06, 2021 at 09:42AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/singer-sunitha-shocking-comments-on-tollywood-director/articleshow/82424311.cms

No comments