Breaking News

భర్తను తలచుకుంటూ బోరున ఏడ్చిన సురేఖావాణి.. అత్తింటి వారితో మనస్పర్థలు.. షాకింగ్ విషయాలు రివీల్


క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి. తనదైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన ఆమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అలా అలా సామాజిక మాధ్యమాల్లో హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది సురేఖ. ఎప్పుడూ ఎంతో చలాకీగా కనిపించే ఆమె నిజ జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు ఉన్నాయని తాజాగా విడుదలైన ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాం ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది. సురేష్ తేజ అనే మీడియా పర్సన్‌ని ప్రేమించి పెళ్లాడిన ఆయనతో హాయిగా జీవితం కొనసాగిస్తున్నా రూమర్స్ మాత్రం ఓ రేంజ్‌లో వెంటాడాయి. తనపై వస్తున్న వార్తలను చాలా సార్లు ఆమె ఖండించింది కూడా. అయితే దురదృష్టవశాత్తు రెండేళ్ల క్రింద ఆమె భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించారు. దీంతో అప్పటినుంచి ఆమె తన కూతురు సుప్రితతో కలిసి ఒంటరిగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ సురేఖావాణి గురించిన రూమర్స్ బాగానే స్ప్రెడ్ అయ్యాయి. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ టాక్ రావడంతో దానిపై గట్టిగానే కౌంటర్స్ ఇచ్చింది సురేఖ. తాజాగా విడుదలైన ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాం ప్రోమోలోనూ ఈ విషయంపై స్పందించిన సురేఖావాణి.. ఆ రెండో వాడు ఎవరో మీరే చెప్పండి అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది. అలాగే తన జీవితానికి సంబంధించిన ఎన్నో షాకింగ్‌ విషయాలను బయటపెడుతూ ఎమోషనల్ అయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సురేష్ తేజ మరణాన్ని తలచుకుంటూ కన్నీరు పెట్టుకుంది సురేఖ. తనను అత్తారింటి వాళ్ళు అపార్థం చేసుకున్నారని, కొన్ని మనస్పర్థల కారణంగా అత్తింటి కుటుంబం తమతో దూరంగా ఉంటోందని ఆమె చెప్పింది. క్లిష్ట పరిస్థితుల్లో సైతం వాళ్లు మాకు ఒక్కరూపాయి కూడా సాయం చేయలేదని, తాను, తన కూతురే అన్నీ సమకూర్చుకున్నామని చెప్పింది. అయినా కూడా తనతో పాటు తన కూతురిని కూడా వాళ్ళు నిందించారని చెబుతూ ఎమోషనల్ అయ్యింది సురేఖ. 'ఈ ప్రోగ్రాం చూశాకైనా నన్ను, నా కూతుర్ని అన్నందుకు వాళ్లు సిగ్గుతెచ్చుకోవాలి' అని సురేఖ కాస్త ఘాటుగానే మాట్లాడింది. మే 10వ తేదీన ఈ ప్రోగ్రాం ఫుల్ ఎపిసోడ్‌లో ఇంకా మరిన్ని విషయాలు తెలియనున్నాయి.


By May 05, 2021 at 04:43PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/surekha-vani-open-comments-on-her-personal-life-and-husband-death/articleshow/82405331.cms

No comments