Breaking News

విడుదలకు ముందే 'రాధే శ్యామ్' హంగామా.. ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు.. ఇండియాలోనే ఫస్ట్ టైమ్


యంగ్ రెబల్ స్టార్ వరుసపెట్టి తన స్థాయిని పెంచుకునే సినిమాలు చేస్తూ వస్తున్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్ స్టార్‌గా ఎదిగిన ఆయన ఆ తర్వాత 'సాహో' అంటూ మరో భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినా అది పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో తదుపరి సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఆయన.. '' అనే పేరుతో ఓ పిరియాడికల్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' సినిమాని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఏకంగా ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా భారీ రేంజ్‌లో రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 30న విడుదలకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ చేసిన అన్ని అప్‌డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ పలు రికార్డులు సృష్టించాయి. అప్పట్లో 'రాధే శ్యామ్' అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో చేసిన హంగామాతో ఈ మూవీ ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ దక్కింది. అదే జోష్‌లో తాజాగా ఈ గ్లింప్స్ వీడియో సుమారు 5 లక్షల లైక్స్ సాధించి.. ఐదు లక్షల లైక్స్ సాధించిన ఫస్ట్ ఎవర్ గ్లింప్స్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు రాధే శ్యామ్ విడుదల కోసం దేశవిదేశాల్లోని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


By May 03, 2021 at 10:13AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-radhe-shyam-telugu-glimpse-new-record/articleshow/82364993.cms

No comments