Breaking News

సినిమా తీస్తానని చెప్పి భారీ మోసం.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్!


మలయాళం మెగాస్టార్ మెహన్‌లాల్ ప్రధాన పాత్రలో ‘ఓడియన్’ అనే సినిమాని రూపొందించిన దర్శకుడు, ప్రముఖ యాడ్ ఫిలిమ్ మేకర్ వీఏ శ్రీకుమార్ మీనన్‌ను శుక్రవారం కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. తన వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకొని.. మోసం చేశాడని శ్రీవాసలం బిజినెస్ గ్రూప్‌కి చెందిన రాజేంద్రన్ పిళ్లై వీఏ శ్రీకుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా చేస్తానని చెప్పి.. తన వద్ద నుంచి ఏడు కోట్లు డబ్బు తీసుకున్నాడని.. ఆ తర్వాత సినిమా తీయకపోగా.. ఆ డబ్బు తిరిగి చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పిళ్లై కంప్లైంట్‌ను స్వీకరించిన పోలీసులు శ్రీకుమార్‌ను శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అతనిపై సెక్షన్ 406, సెక్షన్ 420ల కింద యాక్షన్ తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే అంతకు ముందే శ్రీకుమార్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. దాన్ని కోర్టు తిరస్కరించింది. అయితే శ్రీకుమార్ అరెస్ట్ కావడం ఇది మొదటిసారి కాదు. 2019లో పలు సోషల్‌మీడియా క్యాంపెయిన్‌ల ద్వారా తన పరువు తీసే ప్రయత్నాలు చేస్తున్నాడని.. తన మిత్రులను బెదిరిస్తున్నాడని ప్రముఖ నటి ఈయనపై ఫిర్యాదు చేసింది. ఇతని నుంచి తనకు ప్రాణ హాని కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో శ్రీకుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం బెయిల్‌పై విడిచిపెట్టారు. ముంజు వారియర్.. శ్రీకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఓడియన్‌లో హీరోయిన్‌గా చేసింది. అంతేకాదు.. అతనితో కలిసి పలు యాడ్‌లలో కూడా ఆమె నటించింది.


By May 08, 2021 at 08:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-shrikumar-menon-arrested-on-allegation-of-financial-fraud/articleshow/82474002.cms

No comments