Breaking News

టాలీవుడ్ యంగ్ హీరోపై ఛార్మి లవ్.. సింగిల్ లైన్‌లో మ్యాటర్ చెప్పేసిన బ్యూటీ! డైరెక్టుగా అదే మాట..


గత రెండుమూడు రోజులుగా బ్యూటిఫుల్ హీరోయిన్, నిర్మాత గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె పెళ్లికి రెడీ అయిందనే న్యూస్ సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొట్టడంతో ఛార్మి స్పందించింది. తన పెళ్లి విషయమై క్లారిటీ ఇస్తూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. 'నా జీవితంలో పెళ్లి చేసుకోవడం వంటి తప్పు చేయను' అంటూ అందరినీ ఆశ్చర్యపర్చింది. దీంతో ఛార్మి పెళ్లి మ్యాటర్ జనాల్లో హాట్ టాపిక్ కాగా.. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది ఛార్మి. విజయ్ దేవరకొండతో కలిసి దిగిన పిక్ షేర్ చేస్తూ.. 'నీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. బంగారం 26 క్యారెట్ గోల్డ్ నువ్వు. నేను, పూరి గారు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నామో మాటల్లో చెప్పలేం' అని పేర్కొంది. ఈ మేరకు లవ్ సింబల్ ఎమోజీ కూడా పోస్ట్ చేసింది ఛార్మి. అంటే బంగారం కంటే ఎక్కువే అని చెప్పిందన్నమాట. దీంతో ఈ పిక్, ఛార్మి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసి రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించిన ఛార్మి.. సదరు ప్రొడక్షన్ హౌస్ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా మోస్తోంది. ఇదే బ్యానర్‌పై 'ఇస్మార్ట్ శంకర్' సినిమా రూపొందించి భారీ సక్సెస్ అందుకున్న ఆమె.. ప్రస్తుతం హీరోగా రూపొందుతున్న 'లైగర్' ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లోనే విజయ్ దేవరకొండతో ఫుల్ క్లోజ్ అయింది ఛార్మి. ముంబైలో ఈ యంగ్ హీరోతో కలిసి చాలా పార్టీల్లో చిల్ అయ్యారు ఛార్మి, పూరి. ఇక లైగర్ సినిమా విషయానికొస్తే.. ‘సాలా క్రాస్‌ బ్రీడ్‌’ ట్యాగ్ లైన్‌తో మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.


By May 10, 2021 at 11:48AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/charmy-kaur-expressed-her-feelings-on-vijay-deverakonda/articleshow/82516094.cms

No comments