Breaking News

ఎప్పటికైనా ఆ ఇంటి కోడలే కావాలనుకుంటున్నా.. కోరిక బయటపెడుతూ అసలు విషయం రివీల్ చేసిన రష్మిక


హీరోయిన్ల పెళ్లి విషయాలంటే అందరికీ ఆసక్తే. అది కూడా స్టార్ హీరోయిన్స్ పెళ్లి మ్యాటర్స్ అంటే తెగ ఇంట్రెస్ట్ చూపుతుంటారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లిపై తన మనసులో మాట బయటపెడుతూ అసలు విషయం చెప్పేసింది క్రేజీ బ్యూటీ . ప్రస్తుతం సౌత్ ఇండియన్ తెరపై వరుస ఆఫర్స్‌తో బిజీగా ఉన్న ఈ కన్నడ బ్యూటీకి తమిళ సంప్రదాయం బాగా నచ్చిందట. ఎప్పటికైనా ఆ ఇంటి కోడలినే కావాలనేది తన కోరిక అంటూ ఓపెన్ అయింది రష్మిక. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక మందన.. ఇటీవలే తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 'సుల్తాన్' సినిమాతో తమిళ ప్రేక్షకులను కూడా అట్రాక్ట్ చేసింది. పల్లెటూరి అమ్మాయిగా కనిపించి అక్కడి ఆడియన్స్ మనసు దోచుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా తమిళుల గురించి కొన్ని విషయాలు చెప్పిన రష్మిక.. తనకు తమిళ సంప్రదాయం, సంస్కృతి చాలా బాగా నచ్చిందని చెప్పింది. ముఖ్యంగా అక్కడి భోజనం, వంటలు చాలా రుచికరంగా ఉన్నాయని, అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలన్నదే తన కోరిక అని ఆమె పేర్కొనడం విశేషం. గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపిన రష్మిక.. అతనితో నిశ్చితార్థం కూడా చేసుకొని చివరకు బ్రేకప్ చెప్పింది. అందుకు కారణాలేంటనేవి పెద్దగా బయటకురానప్పటికీ మళ్ళీ ఇలా రష్మిక పెళ్లి మ్యాటర్ తీసుకురావడం జనాల్లో హాట్ టాపిక్ అయింది. 'ఛలో' అంటూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ.. ఆ తర్వాత ''గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, బీష్మ'' సినిమాలతో సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకొని టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'లో నటిస్తోంది. ఈ సినిమాలో గిరిజన యువతిగా రష్మిక కనిపించనుందని తెలుస్తుండటం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.


By May 13, 2021 at 11:59AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rashmika-mandanna-open-comments-on-her-marriage/articleshow/82598280.cms

No comments