Breaking News

సమంత వెబ్‌సిరీస్‌కి ఊహించని షాక్.. ఆ రాష్ట్రం నుంచి తీవ్ర వ్యతిరేకత


‘ఏం మాయ చేశావే’తో వెండితెరకి పరిచయమైన బ్యూటీ సమంత.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో నెం.1 హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగుతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ ఆమె తన సత్తా చాటింది. ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘’ సిరీస్ సీక్వెల్‌లో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోంది. బుధవారం విడుదలైన ఈ సిరీస్‌ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 4వ తేదీన ఈ సిరీస్ విడుదల కానుంది. అయితే ఈ సిరీస్ యూనిట్‌కి ఊహించని షాక్ తగిలింది. తొలి భాగం మొత్తం ముంబైలో జరిగినట్లు చూపించగా.. రెండో భాగం తమిళనాడులో జరిగినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్‌లో తమిళనాడు ప్రజలను కించపరిచేలా డైలాగ్స్ ఉన్నాయని.. తమిళ ప్రజలను ఉగ్రవాదులుగా చూపించారని.. ఆ రాష్ట్రానికి చెందిన వారి నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ వెబ్‌సిరీస్‌ను బ్యాన్ చేయాలంటూ.. తమిళ ప్రేక్షకులు ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. లేదా తమ రాష్ట్రాన్ని కించపరిచేలా ఉన్న దృశ్యాలను తొలగించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. పైగా తమిళనాడుకు చెందిన సమంత ఇలాంటి పాత్ర చేయడం ఏంటని ఆమెను ట్రోల్ చేస్తున్నారు. స్వరాష్ట్రాన్ని కించపరిచేలా ఉండే వెబ్‌సిరీస్‌లో నటించినందుకు సమంత సిగ్గుపడాలని తమిళులు మండిపడుతున్నారు. మంచి తమిళ రాష్ట్రం నుంచి వస్తున్న వ్యతిరేకతపై ఫ్యామిలీమ్యాన్ సిరీస్ యూనిట్ ఎలా స్పందించాలో వేచి చూడాలి. రాజ్ మరియు డికే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మనోజ్ బాయ్‌పేయ్, ప్రియమణిలు హీరో హీరోయిన్లుగా నటించారు. 2019లొ విడుదలైన ఈ సిరీస్‌ పలు ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకుంది.


By May 20, 2021 at 11:41AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tamil-fans-demands-to-ban-samanthas-family-man-web-series/articleshow/82792221.cms

No comments