సినిమా రౌండప్: అలా స్కెచ్చేసిన సుకుమార్.. వైష్ణవ్ తేజ్ డేరింగ్ స్టెప్! ఓపెన్‌గా చెప్పేసిన కృతి

సుకుమార్ డిఫరెంట్ ఆలోచనలు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ 'పుష్ప' మూవీ విషయంలో డిఫరెంట్ ఆలోచనలు చేస్తున్నారట. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్న ఆయన.. రెండో భాగానికి 'పుష్ప 2' అని కాకుండా వేరే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట. కమల్ హాసన్‌తో విజయ్ సేతుపతి ఫైట్ అటు హీరోగా, ఇటు విలన్‌గా ఒకే సమయంలో రాణించడం ఒక్క విజయ్ సేతుపతికే చెల్లుతుందేమో. కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ రూపొందిస్తున్న 'విక్రమ్' మూవీలో విలన్‌గా విజయ్ సేతుపతి నటించనున్నారట. త్వరలోనే ఆయన ఈ సినిమా సెట్స్ మీదకు రానున్నారట. 'ఉప్పెన' బ్యూటీ ఓపెన్ 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టికి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయని టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది కృతి. ప్రస్తుతం తన చేతిలో ఉన్నవి మూడు సినిమాలు మాత్రమేనని చెప్పింది. నాని హీరోగా 'శ్యామ్ సింగ రాయ్'తో పాటు సుధీర్ బాబు, రామ్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నానని చెప్పింది. వైష్ణవ్ తేజ్ డేరింగ్ స్టెప్ మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలకు కమిటవుతున్న ఈ యంగ్ హీరో ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై తన నాలుగో సినిమా ఓకే చేశారు. అయితే ఈ సినిమా హాకీ నేపథ్యంలో సాగనుందని, కెరీర్ ఆరంభంలోనే ఇలా వైష్ణవ్ తేజ్ సరికొత్తగా ప్రయోగం చేయబోతున్నారని టాక్. అందుకు రెడీ అంటున్న ‘వకీల్‌సాబ్’ హీరోయిన్ ‘మల్లేశం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఇటీవలే పవన్ కళ్యాణ్ ‘వకీల్‌సాబ్’ సినిమాతో సక్సెస్ అందుకుంది. ఆ సినిమాలో ఆమె రోల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అవకాశాల వేట మొదలుపెట్టిన అనన్య.. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్స్, స్కిన్‌షో చేయడానికి రెడీ అయిందని తెలుస్తోంది.
By May 19, 2021 at 08:38AM
No comments