Breaking News

లాక్‌డౌన్ వేళ మద్యం హోం డెలివరీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం


దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించడంతో మహమ్మారి నియంత్రణకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌, కర్ఫ్యూలను కొనసాగిస్తున్నాయి. రెండో దశలో కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో చత్తీస్‌గడ్‌లోనూ లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. అయితే, మద్యం మాత్రం హోం డెలివరీ చేవేస్తామని చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి మద్యం ఇంటికే అందిస్తామని చేసిన ప్రభుత్వ ప్రకటనపై ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగడంతో మద్యం దుకాణాలను మూసివేశారు. ఈ సమయంలో మద్యం ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే వారికి నేరుగా హోం డెలివరీ చేయవచ్చని ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదివారం అనుమతి ఇచ్చింది. మే 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు హోం డెలివరీ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ సమయాన్ని స్థానిక పరిస్థితులను బట్టి జిల్లా అధికారులు మార్చుకోవచ్చని తెలిపింది. లాక్‌డౌన్‌ సమయంలో మద్యం అక్రమ తయారీ, అమ్మకం, రవాణా వంటిని కట్టడి చేసేందుకు హోం డెలివరీకి అనుమతి ఇచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. హోం డెలివరీ బాధ్యతలను ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర మార్కెటింగ్‌ కార్పొరేషన్‌(CSMCL)కు అప్పగించారు. ఈ సంస్థ వెబ్‌సైట్‌లో ముందస్తుగా నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో కస్టమర్‌కు గరిష్ఠంగా ఐదు లీటర్ల మద్యాన్ని సరఫరా చేస్తారు. డెలివరీ ఛార్జ్ కింద అదనంగా రూ.100 చెల్లించాలి. గతంలో లాక్‌డౌన్‌ విధించినప్పుడు కూడా మద్యాన్ని హోం డెలివరీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ మండిపడుతోంది. ఇది బాధ్యతరహిత్య, అసంబద్ధమైన నిర్ణయమని దుయ్యబట్టింది. ఆక్సిజన్, వ్యాక్సిన్ సహా అత్యవసర ఔషధాలు కొరతపై దృష్టపెట్టకుండా మద్యం హోం డెలివరీకి అనుమతించడం ఏంటని ప్రశ్నిస్తోంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఔషధాలు అవసరం.. మద్యం కాదు.. కానీ, ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడని సిగ్గుమాలిన నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వం ఆరాటమంతామద్యంపై కమిషన్ల కోసమే.. సాధారణ ప్రజల కోసం కాదు’’ అని చత్తీస్‌గఢ్ బీజేపీ అధికార ప్రతినిధి గౌరీ శంకర్ శ్రీవాస్ అన్నారు.


By May 10, 2021 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/chhattisgarh-begins-online-booking-and-home-delivery-of-liquor-due-to-lockdown/articleshow/82514224.cms

No comments