Breaking News

సల్లూభాయ్‌ని ఫాలో అవుతున్న ప్రభాస్.. ‘రాధే శ్యామ్’ చూడాలంటే డార్లింగ్ ఫ్యాన్స్ అలా చేయక తప్పదా?


రెండో దశలో భయంకరంగా వ్యాప్తిస్తున్న కరోనా వైరస్ కారణంగా మరోసారి సినీ పరిశ్రమ మరోసారి సంక్షోభంలో పడిపోయింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడటం.. షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరుగుతోంది. ఈ క్రమంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు అన్ని తికమకలో పడిపోయాయి. సినిమాలను విడుదలను అపే అవకాశం లేని సినిమాలు నేరుగా ఓటీటీలలో విడుదల చేస్తున్నాయి. కానీ, భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాల పరిస్థితి అలా లేదు. ఓటీటీలో విడుదల చేస్తే.. తమకు రావాల్సిన లాభాలు రావు. దీంతో ఈ సినిమాల విడుదలకు కొత్త విధాన్ని వెతుక్కుంటున్నాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ , దిశా పటానీ కాంబినేషన్‌లో ప్రభుదేవ డైరెక్షన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘రాధే.. ది మోస్ట్ వాంటెడ్ భాయ్’. ఈ సినిమా ట్రైలర్, పాటలను ఈ మధ్యే విడుదల చేశారు. దీంతో పాటు సినిమాని ఈద్ కానుకగా మే 13న థియేట్రికల్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు ఓటీటీల్లో అదే రోజు పే-పర్ వ్యూ విధానంలో సినిమాని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అంటే చూడాలనుకొనే ప్రతీసారి కొంత మొత్తం చెల్లించాలనమాట. థియేటర్‌లో సినిమా విడుదల అయ్యే అవకాశం లేకపోవడంతోనే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విధానంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. అయితే ఇప్పుడు కూడా సల్లూ భాయ్‌ని ఫాలో అవుతున్నాడట. తన సినిమా ‘’ని కూడా పే-పర్ వ్యూ విధానంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నరట. ‘జిల్’ సినిమా దర్శకుడు రాధాకృష్ణ.. ఈ సినిమాని తెరకెక్కించాడు. వింటేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా అప్‌డేట్స్ విషయంలో నిర్మాణ సంస్థ ‘యూవీ క్రియేషన్స్’పై అభిమానులు పీకల వరకూ కోపంలో ఉన్నారు. సినిమా ప్రకటించి.. ఏళ్లు గడుస్తున్న సరైన అప్‌డేట్స్ ఇవ్వకపోవడంతో.. నిర్మాణ సంస్థని చాలాసార్లు ట్రోల్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పుడు ‘రాధే శ్యామ్’ను పే-పర్ వ్యూ విధానంలో రిలీజ్ చేస్తే.. మరోసారి అభిమానుల నుంచి ఆగ్రహం వ్యక్తం కాక తప్పదు. ఈ పే-పర్ వ్యూ విధానానికి యూవీ క్రియేషన్స్ సుముఖంగా లేదని సమాచారం. దాదాపు షూటింగ్ పూర్తైన ఈ సినిమాని జూలై 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికి పరిస్థితులు మెరుగై థియేటర్లు తెరుచుకుంటే.. సినిమాను యధావిధిగా థియేటర్లలోనే రిలీజ్ చేసే యోచనలో నిర్మాణ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. లేని పరిస్థితుల్లో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారని టాక్. మరి ‘రాధేశ్యామ్’.. ‘రాధే’ని ఫాలో అవుతాడా.. లేదా తన రూట్‌లోనే వెళ్తాడా అని వేచి చూడాలి.


By May 02, 2021 at 11:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-radhe-shyam-movie-to-be-released-in-ott-with-pay-per-view/articleshow/82352769.cms

No comments