Breaking News

పెళ్లికి ముందు అలాంటి పార్టీలు.. ఎన్టీఆర్ ఫోన్ చేసి మరీ రమ్మనేవారు.. సీక్రెట్స్ రివీల్ చేసిన సమీర్


యంగ్ టైగర్ కెమెరా ముందు ఎంత ఎనర్జీగా, సరదాగా కనిపిస్తారో నిజ జీవితంలోనూ అలాగే ఉంటారట. మరీ ముఖ్యంగా పెళ్లి ముందుకు అయితే ఎన్టీఆర్‌తో ఆ ఎంజాయ్ వేరులే అంటున్నారు యాక్టర్ . ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ సంగతులను పంచుకున్న సమీర్.. ఎన్టీఆర్ క్యారెక్టర్, తోటి నటులతో ఆయన మెదిలే తీరుపై స్పందిస్తూ కొన్ని పర్సనల్ సీక్రెట్స్ రివీల్ చేశారు. స్నేహానికి ఎంతో విలువనిచ్చే ఎన్టీఆర్‌తో ఇండస్ట్రీ లోని చాలామంది నటీనటులు ఎంతో సన్నిహితంగా ఉంటారు. వర్క్ విషయంలో ఎంత సీరియస్‌గా ఉంటారో మిగతా సమయంలో అంతకంటే ఎక్కువగా సరదాగా ఉంటారని ఆయనతో వర్క్ చేసిన వారు చెబుతుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్‌ కూడా తారక్ సన్నిహితుల్లో ఒకరు. అందుకే వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తారక్ చేసే అల్లరి పనుల గురించి సమీర్‌కి బాగా తెలుసు. తాజాగా వీటి గురించి ఓపెన్ అయ్యారు సమీర్. పెళ్లికి ముందు పలు రకాల పార్టీలు చేస్తూ ఇంట్లోనే ఎక్కువగా ఎంజాయ్ చేసేవారని సమీర్ అన్నారు. ఎన్నోసార్లు ఆ పార్టీలకు తమను కూడా ఆహ్వానించారని చెప్పారు. రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, రాఘవ వంటి ఆర్టిస్టులందరికి వీకెండ్స్‌లో తారక్ నుంచి ఫోన్స్ కాల్స్ వచ్చేవని.. పార్టీ చేసుకుందాం వెంటనే ఇంటికి రావాలని ఆయన చెప్పేవారని సమీర్ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌కి రామ్ చరణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పిన సమీర్.. పెళ్లి తరువాత జూనియర్ ఎన్టీఆర్ పార్టీలు మానేశారని అన్నారు. అంతేకాదు షూటింగ్‌లో కూడా ఎన్టీఆర్ చాలా సరదా మనిషి అని అన్నారు. ఎవరైనా మిస్టేక్ చేస్తే సరదాగా షర్ట్ విప్పించి షూటింగ్‌లో అలాగే ఉంచేవారని, ఆయన ఇచ్చే సరదా పనిష్మెంట్ ఎవ్వరికీ కోపం తెప్పించేదికాదని తెలిపారు. ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్‌ని ఎక్కడా చూడలేదని, అయితే ఎన్టీఆర్ చేసే అల్లరి పనుల వల్ల రాజమౌళితో తిట్లు పడిన సందర్భాలు కూడా ఉన్నాయని సమీర్ అన్నారు.


By May 04, 2021 at 09:54AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-sameer-says-about-jr-ntr-life-style-before-marriage/articleshow/82381785.cms

No comments