Breaking News

BA Raju Death.. ఎన్‌సైక్లోపీడియా అంటూ చిరంజీవి ఎమోషనల్


పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ పీఆర్వో, నిర్మాత గుండెపోటుతో మరణించారు. మధుమేహం వ్యాధితో బాధపడుతున్న ఆయనకు నిన్న అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అర్ధరాత్రి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయనకు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయన కోసం కదిలి వస్తోంది. తాజాగా మెగాస్టార్ స్పందించారు. ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ‘బి. ఏ. రాజు ఈ పేరు తెలియన వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరు.. మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన నాతో షేర్ చేసుకునే వారు. ప్రతీ కొత్త విషయాన్ని ఆయన నుంచి తెలుసుకునే వాడిని. షూటింగ్ స్పాట్‌లో వచ్చి నాతో చాలా సరదాగా ముచ్చటించేవారు. నా చాలా సినిమాలకు ఆయన పీఆర్వోగా పనిచేశారు. సినిమాల సమస్త సమాచారం.. సంవత్సరాల క్రితం రిలీజైన క్లాసిక్స్‌కి సంబంధించిన కలెక్షన్స్, ట్రేడ్ రిపోర్ట్ రికార్డుల గురించి యథాతథంగా చెప్పగల గొప్ప నాలెడ్జ్ బ్యాంక్ ఆయన. ఏ సినిమా ఏ తేదీన రిలీజైంది. ఎంత వసూలు చేసింది? ఏ సెంటర్‌లో ఎన్ని రోజులు ఆడింది.. 100 రోజులు 175 రోజులు 200 రోజులు అంటూ ప్రతీదీ పరిశ్రమకు ఎన్ సైక్లోపీడియాలా సమాచారం అందించేంత ఫ్యాషన్ ఉన్న పత్రికా జర్నలిస్ట్. మేధావి. సూపర్ హిట్ మ్యాగజైన్ కర్త. అనేక సినిమాల సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన బీఏ రాజు గారు లాంటి వారు ఉండటం పరిశ్రమ అదృష్టం. అలాంటి వ్యక్తి నేడు ఇక లేరు. అన్న వార్త విని షాక్‌కి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.


By May 22, 2021 at 10:12AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-condolence-to-ba-raju-death/articleshow/82851018.cms

No comments