Breaking News

సినిమా రౌండప్: 7 రోజులు 6 రాత్రులు.. డాబాపై 'జాతిరత్నాలు' బ్యూటీ.. రిలాక్స్ అంటున్న హీరోయిన్


'జాతిరత్నాలు' బ్యూటీ స్టెప్స్ జాతిరత్నాలు సినిమాలో 'చిట్టి'గా తెలుగు ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఆమె డాబాపై డ్యాన్స్‌ చేసిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. చిరు కోసం సందీప్ రెడ్డి వంగా వరుస సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం 'ఆచార్య' మూవీ చేస్తున్న ఆయన పలువురు దర్శకుల కథలు వింటున్నారు. అయితే టాలీవుడ్ సంచలనం సందీప్ రెడ్డి వంగా మెగాస్టార్ కోసం ఓ కథ రెడీ చేశారట. త్వరలోనే చిరంజీవికి ఈ కథ నేరేట్ చేయబోతున్నారట. ఈ మూడే.. ఫుల్ రిలాక్స్ రిలాక్స్, ప్రశాంతతమైన అనుభూతి పొందితే అంతకన్నా మించిన ఆరోగ్యం లేదంటోంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. ఈ మేరకు వృక్షాసన, త్రికోణాసన, ఉత్కాసన ఈ మూడు ఆసనాలు వేయండి అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. 7 రోజులు 6 రాత్రులు ఫేమస్ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకుడిగా మారి నేటితరం యువత అట్రాక్ట్ అయ్యేలా సినిమాలు రూపొందిస్తున్నారు. రీసెంట్‌గా 'డర్టీ హరి' సినిమా చేసిన ఆయన ఇప్పుడు '7 డేస్‌ 6 నైట్స్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన తొలి చిత్రం డర్టీ హరిని మించి ఈ సినిమా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభాస్ నిర్మాతల దాతృత్వం ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'రాధే శ్యామ్' సినిమా కోసం యువీ క్రియేషన్స్ సంస్థ యాబై పడకలతో సెట్ వేయించింది. కొంతభాగం షూటింగ్ చేశాక కరోనా విపత్కర పరిస్థితులు చూసి.. ఈ యాబై పడకలతో పాటు వాటికి పరుపులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లాంటివన్నీ కలిపి కోవిడ్ పేషేంట్ల కోసం డొనేట్ చేశారు నిర్మాతలు.


By May 11, 2021 at 08:31AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/may-11-movie-roundup-faria-abdullah-malaika-arora-ms-raju-in-news/articleshow/82540308.cms

No comments