Breaking News

ఆరెస్సెస్ చీఫ్‌కి కరోనా.. కోవిడ్ టీకా తీసుకున్నా.!


మహారాష్ట్రలో విజృంభిస్తోంది. ఇప్పటికే వేల కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో సుమారు 58 వేలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కోవిడ్ టీకా తీసుకున్న వారికి కూడా కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆరెస్సెస్ చీఫ్ కరోనా బారిన పడ్డారు. గత నెల 7న ఆయన కోవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన కరోనా బారిన పడ్డారు. కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉండడంతో ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. వెంటనే ఆయన్ను నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు కోవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆరెస్సెస్ ట్వీట్ చేసింది. మహారాష్ట్రలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గతేడాది కరోనాతో వణికిపోయిన మహారాష్ట్రలో సెకండ్ వేవ్‌లోనూ విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు సుమారుగా 50 కొత్త కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ రోగులను చేర్చుకునేందుకు ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి. అంబులెన్సుల్లో పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా కేసులు మాత్రం అదుపులోకి రావడం లేదు. Also Read:


By April 10, 2021 at 02:42PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rss-chief-mohan-bhagwat-tested-positive-for-coronavirus/articleshow/82003569.cms

No comments