Breaking News

ప్రైవేట్ ఆస్పత్రిలో మంటలు.. నలుగురు రోగులు మృతి


ఆస్పత్రుల్లో అగ్నిప్రమాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో ఘటన జరిగింది. మహారాష్ట్రలోని థానేలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఇవాళ తెల్లవారుజామున 3.40 గంటలకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు రోగులు మరణించారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం థానేలోని ప్రైమ్‌ క్రిటికేర్‌ ఆస్పత్రిలో ఈ రోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌, ఇతర బాధితులను మరో ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. రెండు ఫైరింజన్లు, ఓ రెస్క్యూ వాహనం ప్రమాద స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టింది. అయితే రెండ్రోజుల క్రితం కూడా థానేలోని వేదాంత్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత కారణంగా ఐదుగురు కొవిడ్‌ బాధితులు మరణించిన విషయం తెలిసిందే.


By April 28, 2021 at 07:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/fire-broke-out-at-prime-criticare-hospital-in-thane-mumbai/articleshow/82284153.cms

No comments