Breaking News

సినీ వర్గాల్లో విషాదం.. కరోనాతో దర్శకుడు తమిర కన్నుమూత


కరోనా విలయతాండవానికి బ్రేకులు పడటం లేదు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఎంతోమందిని బలి తీసుకుంటోంది. రోజురోజుకూ కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి సైతం రోజుకో చేదు వార్త వినాల్సి వస్తుండటం సినీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులు కరోనా కాటుకు బలి కాగా.. తాజాగా కోలీవుడ్ (53) కరోనాతో కన్నుమూశారు. గత 20 రోజుల క్రిందట కోవిడ్ పాజిటివ్ రావడంతో చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్న ఆయన నిన్న ఏప్రిల్ 27వ తేదీ మధాహ్నం తుదిశ్వాస విడిచారు. కరోనాకు తోడు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటమే మరణానికి కారణమని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. లెజెండరీ దర్శకులు కె.బాలచందర్‌తో పాటు మరికొందరు అగ్ర దర్శకుల దగ్గర తమిర అసిస్టెంట్‌గా పని చేశారు. వాళ్ల దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేసిన అనుభవంతోనే మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2010లో రూపొందించిన ‘రెట్టసూజి’ అనే సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన 2018లో సముద్రఖని, రమ్య పాండియన్ ప్రధాన పాత్రల్లో ‘ఆన్ దేవతై’ సినిమా రూపొందించారు. ఇండస్ట్రీలో అందరితో ఆప్యాయంగా మెదిలే దర్శకుడు తమిర ఇకలేరనే వార్త కోలీవుడ్‌లో విషాదం నింపింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం తెలుపుతున్నారు.


By April 28, 2021 at 07:39AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-thamira-dies-at-53-due-to-corona/articleshow/82284120.cms

No comments