Breaking News

తనపై వస్తున్న రూమర్లపై అంజలి రియాక్షన్.. మీకో దండం అంటూ వకీల్ సాబ్ హీరోయిన్ పోస్ట్


ఈ రోజుల్లో రూమర్స్ స్ప్రెడ్ కావడం చాలా ఈజీ అయిపోయింది. నిజానిజాలు పక్కనబెడితే ఏ చిన్న విషయమైనా జనాల్లో ఇట్టే చర్చనీయాంశం అవుతున్నాయి. మరోవైపు వేగంగా విస్తరిస్తున్న సోషల్ మీడియా అందుకు ప్రధాన వేదిక అవుతోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాద్యమాలతో పాటు న్యూస్ వెబ్‌సైట్స్ హంగామా పెరగడంతో ప్రతీ విషయం వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే సినీ నటి, హీరోయిన్ కరోనా బారిన పడ్డారనే వార్త గత రెండు మూడు రోజులుగా హల్చల్ చేస్తోంది. దీంతో ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యింది అంజలి. అంతకుముందు వకీల్ సాబ్ మరో హీరోయిన్ నివేదా థామస్.. తనకు కరోనా పాజిటివ్ అని తెలుపుతూ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని పేర్కొంది. ఆ తర్వాత వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా నివేదా అటెండ్ కాలేదు. ఈ ఈవెంట్‌లో మరో ఇద్దరు వకీల్ సాబ్ హీరోయిన్స్ అంజలి, అనన్య తెగ హంగామా చేశారు. అయితే ఈ ఈవెంట్ ముగియగానే అంజలికి కరోనా సోకిందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అట్టి వార్తలపై స్పందించిన అంజలి.. అవన్నీ ఫేక్ వార్తలు అంటూ ట్వీట్ పెట్టేసింది. ఈ మేరకు దండం పెడుతూ తాను క్షేమంగా ఉన్నానని పేర్కొంది. తనకు కరోనా సోకలేదని తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలుపుతూ ఆ రూమర్స్‌ని ఖండించింది. దీంతో ప్రేక్షకులు ఓ క్లారిటీకి వచ్చేశారు. ఇకపోతే అంజలి, అనన్య, నివేదా హీరోయిన్లుగా నటించిన 'వకీల్ సాబ్' సినిమా నేడే (ఏప్రిల్ 9) గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో పవన్ యాక్టింగ్‌తో పాటు హీరోయిన్స్ పర్‌ఫార్‌మెన్స్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.


By April 09, 2021 at 11:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/heroine-anjali-reaction-on-corona-positive-news/articleshow/81982673.cms

No comments