Breaking News

మోదీ విజ్ఞ‌ప్తికి సానుకూల స్పందన.. కుంభమేళా నుంచి వైదొలగిన అతిపెద్ద అఖాడా


ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞ‌ప్తికి సానుకూలంగా స్పందించిన అధిపతి అవధేశానంద గిరి స్వామీజీ.. కుంభమేళా నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించారు. మోదీ ఫోన్‌చేసి మాట్లాడిన కొద్ది గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నిరంజనీ, ఆనంద్ అఖాడాలు నిష్క్రమించగా.. ఆ జాబితాలో జునా చేరింది. ఏప్రిల్ 30 వరకు కుంభమేళా జరగనుండగా.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందుగానే నిష్క్రమిస్తున్నారు. జూనా స్వామీజీ నుంచి ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే అవాహన్, అగ్ని అఖాడాలు కూడా తామూ విరమించుకున్నట్టు పేర్కొన్నాయి. మహానిర్వాణీ అఖాడా స్వామీజీ మహామండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కుంభమేళా దేశంలో కరోనా సూపర్ స్ప్రెడ్‌గా మారింది. వేడుకలను ముందుగా విరమించుకోవాలనే ఆలోచనను కొన్ని అఖాడాలు ముఖ్యంగా వైష్ణవులు విముఖంగా ఉన్నప్పటికీ జూనా నిర్ణయంతో కుంభమేళా రద్దీ తగ్గే అవకాశం ఉంది. ‘‘మూడు అఖాడా పీఠాధిపతులు మోడీ సలహాను అభినందిస్తున్నారు.. కాని చివరి షాహ్నీ స్నానానికి ప్రతీకగా స్నానం ఆచరణ సాధ్యం కాదు. పెద్ద సంఖ్యలో రావద్దని మా అనుచరులను కోరుతున్నాం... చివరి షాహి స్నాన్‌లో కేవలం సాధువులు మాత్రమే మునుగుతారు ”అని నిర్మోహి అఖాడా చీఫ్ మహంత్ రాజేంద్ర దాస్ అన్నారు. వేడుకలను ముందుగానే ముగించడానికి ఇతర అఖాడాలు, స్వామీజీల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడింది లేదా అనేది ముఖ్యం కాదని అవధేశానంద గిరి స్వామీజీ వ్యాఖ్యానించారు. అఖాడాలు నిర్ణయంతో భక్తుల సంఖ్య తగ్గుతుంది, దీని వల్ల అధికార యంత్రాంగానికి కొంత ఉపశమనం కలుగుతుంది. శనివారం మధ్యాహ్నం జునా అఖాడాలోని సాధువులంతా సమావేశమై ప్రజారోగ్యం దృష్ట్యా కుంభమేళా నుంచి నిష్క్రమించాలని నిర్ణయించారు. దీంతో శనివారం తమ అఖాడాకు చెందిన 400 మంది వరకు సాధువులు మేళా నుంచి వెళ్లిపోయినట్టు అవధేశానంద గిరి స్వామీజీ తెలిపారు. ‘‘కుంభ మేళా ఉత్సవాలు ప్రతీకగా జరుగుతాయని సాధువుల తరఫున నేను ప్రధానికి హామీ ఇచ్చాను... కుంభ్ వద్ద సాధువులు ప్రధాని విజ్ఞప్తిని స్వాగతించారు.. ఈ వేడుకలో జరిగే క్రతువులు ఒక ప్రతీకగా మాత్రమే ఉంటాయి ... మత విశ్వాసం ముఖ్యం, కానీ ప్రాణాలు అంత కంటే ఎక్కువ’’ అని స్వామీజీ వ్యాఖ్యానించారు. జునా అఖాడా నిర్ణయానికి అవాహన్ అఖాడా మద్దతు తెలిపింది. ప్రజల ప్రాణాలను కాపాడటమే తమకు ముఖ్యమని ఆ పీఠం జనరల్ సెక్రెటరీ మహంత్ సత్య గిరి స్వామీ వ్యాఖ్యానించారు.


By April 18, 2021 at 11:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/largest-akhada-exits-kumbh-mela-after-pm-calls-for-symbolic-observance/articleshow/82126650.cms

No comments