Breaking News

పూజా హెగ్డే ఇంట్లో నైట్ పార్టీ.. వాళ్లందరితో రాత్రంతా రచ్చ రచ్చ


టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా పూజా హెగ్డే దూసుకుపోతోన్నారు. బుట్టబొమ్మగా పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇప్పుడు పూజా హెగ్డే పూర్తిగా సౌత్ మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. బాలీవుడ్‌లో పూజా హెగ్డేకు మంచి డిమాండ్ ఉంది. ఇక తెలుగులోనూ తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతోన్నారు. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ తన సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం పూజా హెగ్డే పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. తెలుగులో రాధేశ్యామ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, ఆచార్య వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో భాగస్వామి అయ్యారు. ప్రభాస్ పక్కన నటిస్తూ రాధేశ్యామ్ సినిమాతో ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో రచ్చ చేసేందుకు రెడీ అయ్యారు. ఇక అఖిల్ పక్కన బ్యాచ్‌లర్ సినిమాలో కనిపించి కుర్రకారును మెప్పించేందుకు రెడీగా ఉన్నారు. అంతేకాకుండా చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ కాంబోలో వస్తోన్న ఆచార్య వంటి భారీ ప్రాజెక్ట్‌లో ఓ కీ రోల్ పోషిస్తున్నారు. నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే లుక్కును మొన్నీ మధ్యే విడుదల చేశారు. రామ్ చరణ్ పూజా హెగ్డే కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయ్యేట్టు కనిపిస్తున్నారు. ఇక ఇవే కాకుండా కోలీవుడ్‌లో దళపతి విజయ్‌తో ఓ ప్రాజెక్ట్ ఓకే అయింది. విజయ్ 65వ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఇలా తన ప్రాజెక్ట్‌లతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి తగిన సమయాన్ని కేటాయిస్తుంటారు. పూజా హెగ్డే తన ఫ్యామిలీతో కలిసి చేసే అల్లరి గురించి సోషల్ మీడియాలో చెబుతుంటారు. గతేడాది లాక్డౌన్ సమయంలో పూజా హెగ్డే చేసిన అల్లరి, తన ఫ్యామిలీ అంతా కూడా రూంలోనే చిక్కుకుపోవడం, తన తండ్రికి దగ్గరుండి మరీ మందు పోయడం, ఆ సమయంలో తండ్రికి ఇష్టమైన స్టఫ్ కూడా తయారు చేసినట్టు చెబుతూ పూజా హెగ్డే షేర్ చేసిన ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా పూజా హెగ్డే ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేసింది. ఈ మేరకు పూజా హెగ్డే ఇంట్లో నిన్నంతా కూడా వేడుకలు జరిగాయి. పూజా హెగ్డే తన తండ్రి మంజునాథ్ 60వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలెబ్రేట్ చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లినట్టున్నారు. అక్కడ స్పెషల్‌గా ఓ కచేరి ప్రోగ్రాంను కూడా పెట్టించినట్టు కనిపిస్తున్నారు. మొత్తానికి నిన్న మాత్రం పూజా హెగ్డే ఫ్యామిలీ అంతా కూడా రచ్చ రచ్చ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డే ఫ్యామిలీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


By April 18, 2021 at 12:00PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pooja-hegde-celebrates-her-father-60th-birthday/articleshow/82126938.cms

No comments