Breaking News

బీజేపీపై పోరాటానికి కలిసి రండి.. కేసీఆర్‌, జగన్‌ సహా విపక్ష నేతలకు దీదీ లేఖ


ఒక్కరిగా ఉంటే బీజేపీని ఎదుర్కోవడం కష్టమనే తత్వం ప్రతిపక్షాలకు ఇప్పుడిప్పుడే బోధపడినట్టుంది. బీజేపీని నిలువరించి, తమను తాము కాపాడుకోవాలంటే విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీలక రాజకీయ సమరాన్ని ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి జాతీయ రాజకీయాల దిశగా వ్యూహాత్మకంగా ఓ అడుగు ముందుకేశారు. బీజేపీని దీటుగా ఎదుర్కొనడానికి కలిసికట్టుగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈమేరకు కాంగ్రెస్, ఎన్‌సీపీ, ఆర్జేడీ, శివసేన, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ సహా పదిహేను విపక్ష పార్టీల అగ్రనేతలకు దీదీ మార్చి 28న ఓ లేఖ రాశారు. ‘రాష్ట్రాల అధికారాలను నీరుగార్చి, వాటిని కేవలం మునిసిపాలిటీలకు పరిమితం చేయాలని కేంద్రంలోని ప్రభుత్వం కోరుకుంటుంది. చివరికి దేశంలో ఏకపార్టీ పాలనను ఏర్పాటు చేయాలని భావిస్తోంది’’ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అనుసరిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి రావాలి.. ప్రజాస్వామ్యం పెద్ద ప్రమాదంలో పడింది.. ‘రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థపైనా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సమైక్యంగా, సమర్థంగా పోరాడేందుకు సమయం ఆసన్నమైంది. అందరం కలిసి దేశ ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని అందించాలి. ఇందుకు కలిసిరావాలని కోరుతున్నాను’’ అని ఆమె తన లేఖలో విజ్ఞప్తి చేశారు. దీదీ లేఖను బట్టి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంయుక్త వ్యూహరచనకు మమత పిలుపివ్వడం, దాదాపుగా అన్ని పార్టీలకూ బీజేపీ ఉమ్మడి శత్రువుగా మారడంతో ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈసారి కూడా గెలుపుపై ధీమాగా ఉన్న మమత, ఈ విపక్షాల ఐక్యతకు కేంద్ర బిందువుగా మారే ప్రయత్నాన్ని ఈ లేఖ ద్వారా చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మమతా లేఖను అందుకున్నవారిలో కాంగ్రస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌, డీఎంకే నేత స్టాలిన్‌, మహాసీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, యువనేతలు అఖిలేష్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, సీపీఐ (ఎంఎల్) దీపాంకర్‌ భట్టాచార్య తదితరులు ఉన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రీ త్యా వెంటనే మమత లేఖకు ఎవరూ స్పం దించకపోవచ్చునని, అయితే కాంగ్రెస్‌ సహా కొన్ని పార్టీలతో అవగాహన ఉన్నందువల్లే ఆ మె ఈ లేఖ రాశారని ఈ వర్గాలు తెలిపారు.


By April 01, 2021 at 09:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bengal-cm-mamata-writes-letter-to-opposition-leaders-calls-on-them-to-unite-against-bjp/articleshow/81813438.cms

No comments