Breaking News

మహారాష్ట్ర హోంమంత్రికి షాక్.. సీబీఐ విచారణకు బాంబే హైకోర్టు ఆదేశం


మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై విచారణకు ఆదేశించింది. ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఈ విచారణలో ఆధారాలు లభ్యమైతే ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని సూచించింది. విచారణ కోసం నియమించిన అధికారులకు అన్ని పార్టీల సహకరించాలని పేర్కొంది. బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ పోలీసు అధికారులకు హోంమంత్రి నిర్ధేశించారని పరమ్‌బీర్‌ సింగ్‌ ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. పోలీస్ కమిషనర్ చేసిన ఈ ఆరోపణలు మహారాష్ట్ర ప్రభుత్వంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. హోంమంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అదే సమయంలో హోంమంత్రి వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పరమ్‌బీర్‌ తొలుత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, ఈ అంశంపై తొలుత హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. సుప్రీం సూచన మేరకు పరమ్‌బీర్‌ బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై జయశ్రీ పాటిల్ కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పరంబీర్ సింగ్ పిటిషన్‌పై మార్చి 30న విచారణ పూర్తిచేసిన బాంబే హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, నిర్ణయాన్ని వెలువరించింది. అయితే, విచారణ సందర్భంగా పోలీస్ అధికారి పరమ్‌బీర్ సింగ్‌‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిపై ఆరోపణల విషయంలో ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదుచేయలేదని పదే పదే నిలదీసింది. ‘మీరు పోలీసు కమిషనర్, మీ కోసం చట్టాన్ని ప్రత్యేకంగా ఎందుకు కేటాయించాలి? పోలీస్ అధికారులు, మంత్రులు, రాజకీయ నేతలు చట్టానికి అతీతులా? అంటే మీరు చట్టాలకు అతీతులమని భావిస్తున్నారా?’ అంటూ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీజే దత్ వ్యాఖ్యానించారు.


By April 05, 2021 at 12:28PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bombay-hc-orders-cbi-probe-into-allegations-made-by-parmbir-on-home-minister-anil-deshmukh/articleshow/81909502.cms

No comments