Breaking News

యాక్సెప్ట్ చేశామా అంతే! మన లైఫ్ వాళ్ళ చేతిలో ఉంటుందిక.. హాట్ టాపిక్ అయిన నాగార్జున కామెంట్స్


ఈ రోజుల్లో సెలబ్రిటీలు- సాధారణ ప్రజల మధ్య ప్రధాన వారధిగా ఉంటున్నాయి సోషల్ మీడియా అకౌంట్స్. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్స్‌స్టా లాంటి సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్నో విషయాలను ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. డైరెక్టుగా కాంటాక్ట్ లేకున్నా కామెంట్ రూపంలో ఓ సాధారణ వ్యక్తి చెప్పదలచుకున్న విషయం సెలబ్రిటీ దాకా చేరడం చాలా ఈజీ అయిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో ఇదే సెలబ్రిటీలకు లేనిపోని తలనొప్పులు తెస్తుండటం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విషయమై తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ చర్చల్లో నిలుస్తున్నాయి. వైవిద్యభరితమైన రోల్స్ ఎంచుకోవడంలో కింగ్ అని నిరూపించుకున్న నాగార్జున ఇటీవలే 'వైల్డ్ డాగ్' అనే డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అనుకున్న రేంజ్ కాకపోయినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ సాధించడంతో హ్యాపీ మూడ్‌లో ఉన్నారు నాగ్. ఈ నేపథ్యంలో హీరో రానా నిర్వహిస్తున్న టాక్ షో 'నెంబర్ 1 యారీ'లో పాల్గొన్న నాగార్జున.. ముచ్చట్లతో పాటు పలు వ్యక్తిగత విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. సోషల్ మీడియాను మీరెలా హ్యాండిల్ చేస్తారో చెప్పండని రానా అడగ్గా, నాగార్జున స్పందిస్తూ.. ''అంత యాక్టివ్ అయితే కాదు. గత ఆరేడేళ్ల క్రితం ట్విట్టర్ కొత్తగా వచ్చిందని తెలిసి అకౌంట్ ఓపెన్ చేశా. దాని తర్వాత ఒకటి రెండు సంవత్సరాల్లో అది ఒపీనియేటెడ్, నెగెటివ్.. ఆ నోటిఫికేషన్స్ యాక్సెప్ట్ చేస్తే మన లైఫ్ మనం మార్చేసుకోవాలి. రేపు పొద్దున నేను ఏం బట్టలు వేసుకోవాలి.. ఏం తినాలి.. ఏం చేయాలి.. అన్నీ వాళ్లే చెప్తారు. ఎవరో అనామకులు, నాకు తెలియని వాళ్ళు నా లైఫ్‌లో నేను ఎలా ఉండాలో చెబుతుంటే నా వల్ల కావడం లేదు. అప్పటినుంచి నోటిఫికేషన్స్ ఆఫ్ చేశా'' అని అన్నారు. దీంతో సోషల్ మీడియా ఖాతాలపై నాగార్జున మాట్లాడిన తీరు జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ట్విట్టర్‌లో 6 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ స్టార్ హీరో మాటలు జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.


By April 06, 2021 at 09:04AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nagarjuna-shocking-comments-on-his-twitter-handle/articleshow/81924515.cms

No comments