Breaking News

సినిమా రౌండప్: జీవితా రాజశేఖర్‌ కూతురు లేఖ.. మేజర్ డేరింగ్ స్టెప్.. యంగ్ హీరోయిన్ స్ట్రాంగ్ పంచ్


శివాత్మిక 'లేఖ' 'దొరసాని'గా కెమెరా ముందుకొచ్చిన జీవితా రాజశేఖర్‌ డాటర్ శివాత్మిక కొత్త సినిమా 'పంచ తంత్రం'. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. 'లేఖ'గా శివాత్మిక కనిపించనుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, రాహుల్‌ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పర్మిషన్ లేదని 'మేజర్' స్టెప్ అడవి శేష్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మేజర్‌’. శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 26/11 ముంబై నగరంలో తాజ్‌ హోటల్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ఆరు భారీ సెట్స్ వేశారు. తాజ్‌ హోటల్‌లో షూటింగ్ పర్మిషన్ రాకపోవడంతో ఏకంగా ఆ సెట్ వేసేశారు. వైరస్‌కి ఆదా శర్మ పంచ్ దేశంలో కరోనా మహమ్మారి వీర విజృంభణ చేస్తున్న నేపథ్యంలో ఆ వైరస్‌కి స్ట్రాంగ్ పంచ్ ఇచ్చింది ఆదా శర్మ. 'కరోనా గో!' అని కామెంట్స్ చేస్తూ బాక్సింగ్‌ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది ఈ బ్యూటీ. రజినీకాంత్ స్పెషల్ పర్మిషన్ సూపర్‌స్టార్‌ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’ షూటింగ్‌కి ప్రత్యేక అనుమతి లభించిందని తెలుస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు కర్ఫ్యూ తెలంగాణ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అయితే ‘అన్నాత్తే’ హైదరాబాద్ షెడ్యూల్ అంతా నైట్ షూట్ సన్నివేశాలే ఉన్నాయట. దీంతో ఈ మూవీ యూనిట్ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌ పోలీసుల నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకుందని సమాచారం. సీక్రెట్ చెప్పేసిన మాజీ ప్రపంచ సుందరి ఏప్రిల్‌ 22 ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఒకప్పటి విశ్వ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్‌ ఓపెన్ అవుతూ తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ బయటపెట్టింది. 'నచ్చిన ఆహారం తినే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది కానీ శాఖాహారంతో కలిగే లాభాలు ఎక్కువ. నా ఫిట్‌నెస్‌ రహస్యం శాఖాహారమే' అని చెప్పింది.


By April 23, 2021 at 08:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/april-23-movie-round-up-all-latest-updates-here/articleshow/82207723.cms

No comments