Breaking News

తండ్రి కోసం వెళ్లి చిక్కుల్లో పడిన శ్రుతీ హాసన్.. క్రిమినల్ కేసు?


తమిళనాడు ఎన్నికల వేళ సిత్రాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన మక్కల్ నీది మయం(ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు కుమార్తె, హీరోయిన్ శ్రుతీ హాసన్‌పై బీజేపీ ఫైర్ అయింది. పోలింగ్ కేంద్రాన్ని అక్రమంగా సందర్శించారని ఎన్నికల సంఘానికి కమలం పార్టీ ఫిర్యాదు చేసింది. తన తండ్రి, ఎంఎన్‌ఎం చీఫ్ కమల్ పోటీ చేస్తున్న కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గ పరిధిలోని ఓ బూత్‌లోకి ఆమె ప్రవేశించారు. తండ్రి కమల్‌తో కలసి శ్రుతి పోలింగ్ బూత్‌లోకి వెళ్లడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం బూత్ ఏజెంట్లకు మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుందని.. కనీసం నిబంధనలు పాటించకుండా ఆమె తన తండ్రితో కలసి అక్రమంగా బూత్‌ను సందర్శించారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరింది. కోయంబత్తూరు సౌత్ బీజేపీ అభ్యర్థి, కమల్ ప్రత్యర్థి అయిన వసతి శ్రీనివాసన్ తరఫున ఆ పార్టీ నేత నందకుమార్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. నిన్న తమిళనాడు ఎన్నికల పోలింగ్ సందర్భంగా కమల్ హాసన్, ఆయన కూతుళ్లు శ్రుతీ, అక్షర హాసన్‌లతో కలసి చెన్నైలో ఓటు వేశారు. అనంతరం తాను పోటీ చేస్తున్న కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గానికి శ్రుతీతో కలసి వెళ్లారు. నియోజవర్గంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆ సమయంలో తండ్రితో పాటు కూతురు శ్రుతీ హాసన్ కూడా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంపై బీజేపీ గరంగరమైంది. Also Read:


By April 07, 2021 at 04:41PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-complaints-to-election-officials-against-kamal-haasans-daughter-shruti-haasan/articleshow/81950950.cms

No comments