Breaking News

అలా అనుకున్నంత కాలం ఇంతే.. యాంకర్ రష్మీ ఎమోషనల్


బుల్లితెరపై యాంకర్ రష్మీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై ఎన్నో యేళ్ల నుంచి ఉన్నా కూడా రాని గుర్తింపు జబర్దస్త్ షో వల్ల వచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మీ అప్పటినుంచి ముందుకు దూసుకుపోతూనే ఉన్నారు. అలాంటి రష్మీ వెండితెరపైనా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించారు. అయితే వెండితెరపై రష్మీకి అంతటి ఆధరణ లభించలేదు. చేసిన సినిమాలన్నీ కూడా బెడిసి కొట్టడంతో ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో రష్మీ చేసే సందడి అందరికీ తెలిసిందే. మూగజీవాలకు సంబంధించిన పోస్ట్‌లు చేస్తూ అందరికీ అవగాహన కలిగిస్తుంటారు. పెట్స్ పట్ల ఎంతో ప్రేమ కనబరిచే రష్మీ వాటి కోసం పరితపిస్తూ ఉంటారు. కష్టకాలమైన లాక్డౌన్‌లో గతేడాది రష్మీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వీధి కుక్కలు ఆహారం లేకుండా అలమటిస్తుంటే వాటి కోసం రోడ్డు ఎక్కేశారు. అలా రష్మీ మానవత్వాన్ని ప్రదర్శిస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో రష్మీ పెట్స్‌కు సంబంధించిన సంస్థలతో పని చేస్తుంటారు. రష్మీకి సామాజిక బాధ్యత కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడూ కూడా సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రశ్నిస్తుంటారు. ఆచారాలు, సంప్రదాయాల పేరిట మూగ జీవాలను హింసించే వారిని రష్మీ నిలదీస్తుంటారు. అలాంటి సామాజిక స్పృహ ఉన్న రష్మీ తాజాగా ఓపోస్ట్ చేశారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై రష్మీ ఆవేదన చెందారు. విజృంభణపై తన స్టైల్లో స్పందించారు. ఒక వేళ మీరు ఇంట్లో ఉండే ఆప్షన్ ఉంటే.. ఎక్కడికి వెళ్లకండి.. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి అని కోరారు. దేన్నీ అంత ఈజీగా తీసుకోకండి.. జీవితంతో ఆటలు ఆడకండి.. ఇది మనకు పరీక్షా కాలవంటిది.. దయచేసి నియమ నిబంధనలు పాటించండ.. మాస్కులు ధరించి శానిటైజ్ వాడండి.. అయితే మనం వీటన్నంటిని ప్రభుత్వం విధించే నిబంధనలుగా చూసినంత కాలం మనం దేశంలో కరోనా పరిస్థితి ఇంతే ఉంటుంది. ఇది మారదు. కరోనా లేని దేశంగా అవతరించదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని ముందుకు వచ్చినప్పుడే జరుగుతుందని రష్మీ చెప్పుకొచ్చారు.


By April 20, 2021 at 02:11PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-rashmi-emotional-post-about-covid-19-second-wave/articleshow/82160210.cms

No comments