Breaking News

పబ్లిక్‌గా అతనితో హీరోయిన్ ఎంజాయ్! సడెన్‌గా ఎత్తేయడంతో బ్యూటీ షాక్.. నెట్టింట హాట్ వీడియో దుమారం


ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సోషల్ మీడియా వాల్స్ చూస్తే కుర్రకారుకు పిచ్చెక్కిపోతోంది. స్నేహితులు, బాయ్ ఫ్రెండ్స్‌తో తాము వేస్తున్న రొమాంటిక్ ట్రిప్స్, చేస్తున్న ఎంజాయ్ తాలూకు వివరాలతో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నారు కొందరు హాట్ బ్యూటీలు. ఎప్పటికప్పుడు నెట్టింట హీటు పుట్టించడమే టార్గెట్‌గా యంగ్ హీరోయిన్స్ పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా యంగ్ బ్యూటీ షేర్ చేసిన ఓ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకున్నా తమిళ, మలయాళ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితం పార్వతి నాయర్. ప్రస్తుతం తమిళ, మలయాళీ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు తన స్నేహితులతో కలిసి వెళ్ళింది. అక్కడి అందమైన లొకేషన్స్, బీచ్ చుట్టేస్తూ రొమాంటిక్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. అమ్మడి క్లివేజ్ షో చూసి పరేషాన్ అవుతున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలోనే ఓ షాకింగ్ వీడియో పోస్ట్ చేస్తూ అతను చేసిన పనికి సర్‌ప్రైజ్ అయ్యానంటూ కామెంట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. 'మా జోష్ మీట్‌లో అనుకోకుండా ఈ సరదా ఇన్సిడెంట్ జరిగింది. ఊహించని విధంగా నన్ను పైకెత్తి సర్‌ప్రైజ్ చేశాడు మైఖేల్ అజయ్. నేనైతే షాకయ్యా!' అంటూ కామెంట్ చేసింది పార్వతి నాయర్. మరోవైపు ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన మైఖేల్ కూడా తన సోషల్ మీడియా వాల్‌పై ఈ వీడియో పోస్ట్ చేస్తూ 'ఆ ప్రదేశంలో ఆమెనలా ఆశ్చర్యపరిచా' అంటూ ట్యాగ్ చేశాడు. దీంతో ఈ హాట్ వీడియో చూసిన నెటిజన్లు మరింత హాట్‌గా కామెంట్స్ పెడుతున్నారు.


By April 23, 2021 at 01:05PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/viarl-video-parvati-nair-enjoying-in-maldives/articleshow/82211664.cms

No comments