Breaking News

ఈ జీవితానికి ఇంకేం కావాలంటూ మంగ్లీ ఎమోషనల్ మెసేజ్.. అక్కడ తన ఫొటోలు చూసుకొని ఫోక్ సింగర్ ఫిదా


ఓ వ్యక్తి ఫేమస్ కావాలంటే టాలెంట్ ప్రూవ్ చేసుకోవడాన్ని మించిన అస్త్రం ఇంకోటి లేదనే చెప్పుకోవాలి. ఒక్కొక్కరికీ ఒక్కో రంగంలో ప్రావీణ్యం ఉంటుంది. కాకపోతే ఎన్ని కష్టాలొచ్చినా దాన్ని వెలికితీస్తే పాపులారిటీ దానంతట అదే వచ్చేస్తుంది. అంచెలంచెలుగా ఎక్కడికో తీసుకెళ్తుంది. ఆ విజయాన్ని చూసినపుడు కలిగే ఆనందాన్ని మించింది ఈ లోకంలో మరొకటి ఉండదు. తాజాగా అదే చెబుతోంది. తనకు దక్కిన గుర్తింపును చూసి ఎమోషనల్ కామెంట్స్ చేసింది ఈ ఫోక్ సింగర్. ఓ టీవీ ఛానెల్‌లో న్యూస్ యాంకర్‌గా మొదలైన మంగ్లీ ప్రయాణం తీన్మార్ వార్తలతో సాధారణ పల్లెలకు చేరుకుంది. తనదైన మాటలు, ఆట, పాటతో క్లాస్, మాస్ ఆడియన్స్‌లో క్రేజ్ అందుకుంది మంగ్లీ. ఆమె పాడే జానపద గీతాలు, చేసే వీడియోలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ రావడంతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాల్లో కూడా పాటలు పాడి టాలెంట్ బయటపెట్టింది. థమన్ బాణీల్లో 'రాములో రాములా' అంటూ జనాన్ని ఉర్రూతలూగించి ఆ తర్వాత 'సారంగ దరియా' పాటతో ఫేమస్ ఫోక్ సింగర్ అయింది. Also Read: తెలుగుతో పాటు కన్నడలో రాబర్ట్ అనే సినిమాలో 'కన్నె అదిరింది' పాటతో అక్కడి జనాలను సైతం అట్రాక్ట్ చేసింది మంగ్లీ. దీంతో ఆమెకు అక్కడి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఏకంగా కొన్ని కర్ణాటక బస్సులపై మంగ్లీ ఫొటోలు అంటించి చక్కర్లు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మంగ్లీ.. కన్నెడియన్స్ చూపిస్తున్న అభిమానం పట్ల ఫిదా అయింది. ఈ మేరకు ''ఈ జీవితానికి ఇంకేం కావాలి..?! సదా మీ ప్రేమను కోరుకునే.. మీ మంగ్లీ'' అంటూ చేతులు జోడించి కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టింది.


By April 20, 2021 at 11:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/singer-mangli-emotional-comments-on-her-photos/articleshow/82157310.cms

No comments