Breaking News

బిగ్ న్యూస్: ఇక పని ప్రదేశాల్లో టీకా.. వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం


దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్‌‌ను వేగవంతం చేసే దిశగా ఈ నిర్ణయం ప్రకటించింది. ఇకపై పని ప్రదేశాల్లోనూ వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి ఇచ్చింది. పనిచేసే ప్రదేశాల్లో కనీసం 100 మంది టీకా వేయించుకొనేందుకు సిద్ధంగా ఉంటే అక్కడే వ్యాక్సినేషన్‌ చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించినట్లు ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి పని ప్రదేశాల్లో టీకాను అందుబాటులోకి తీసుకురానున్నారు. అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే.. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నందున పని ప్రదేశాల్లోనూ ఈ ఏజ్ గ్రూప్ వారికే టీకా వేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఏప్రిల్ నెలలో ఆదివారాలు, శనివారాలు సహా అన్ని రోజుల్లోనూ టీకా పంపిణీ కొనసాగించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది. Must Read: కరోనా విలయతాండవం.. భారత్‌లో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,15,736 పాజిటివ్‌గా కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా వైరస్ అడుగుపెట్టిన తర్వాత ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులివే. గతేడాది సెప్టెంబర్‌లో 97 వేల కేసులు నమోదు కాగా.. రెండు రోజుల కిందట తొలిసారిగా రోజూవారీ కేసులు లక్ష మార్కు (1,03,558)ను దాటాయి. మంగళవారం అంతకుమించిన కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి గడిచిన 24 గంటల్లో 630 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో ఇప్పటివరకు 1.28 కోట్ల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 1,66,177 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 8,43,473 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం తెలిపింది. Also Read: ✦ ✦


By April 07, 2021 at 06:45PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-allows-covid-vaccination-at-workplaces-from-april-11/articleshow/81952878.cms

No comments