Breaking News

కోర్టుకి రావడానికి ‘కరోనా’ సాకు.? ఎంచక్కా పార్టీ మీటింగ్‌‌‌కి.. మాజీ సీఎం


కోవిడ్ మహమ్మారి మరోమారు విజృంభిస్తున్న తరుణంలో అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన నేతలే నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. కుటుంబ సభ్యులకు కరోనా సోకడం కారణంగా కోర్టుకి హాజరుకాలేనని చెప్పిన ఓ మాజీ సీఎం.. వారం తిరక్కుండానే పార్టీ మీటింగ్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి సమావేశాలకు హాజరవడం కన్నడనాట తీవ్ర కలకలం రేపుతోంది. హెచ్‌డీ కుమారస్వామి గత వారం ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన తండ్రి, దేశ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, తల్లి చెన్నమ్మకు కరోనా సోకిందని.. వారితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నందువల్ల తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని కుమారస్వామి కోర్టుకు తెలిపారు. ఈ పరిస్థితుల్లో కోర్టుకు హాజరుకాలేనని ఆయన తరఫు న్యాయవాది జడ్జికి విన్నవించారు. మాజీ సీఎం కుమారస్వామి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం ఓ షరతు విధించింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న కారణంగా ఈ నెల 17 వ తేదీ వరకూ ఎలాంటి సమావేశాలు, సభల్లో ఆయన కనిపించరాదని సూచించింది. ఒకవేళ అలా కనిపిస్తే ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. అయితే కుమారస్వామి సోమవారం రాత్రి జేడీఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం ఆసక్తికర చర్చకు దారితీసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ ఆయన సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. అయితే కోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి మరి!! Also Read:


By April 07, 2021 at 03:14PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-ex-cm-kumaraswamy-attend-party-meeting-breaks-court-orders/articleshow/81949386.cms

No comments