Breaking News

రీఎంట్రీకి రెడీ అయిన పవన్ హీరోయిన్.. ఆరేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపైకి.. హీరోగా ఎవరంటే..


చేసినవి కొన్ని సినిమాలే అయినా.. తన అభినయం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది కేరళ నటి . పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్, రవితేజాతో భద్ర, విశాల్‌తో పందెం కోడి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ భామ. ఏ మాత్రం బాడీ షో చేయకుండా కేవలం ముఖలలో హావభావాలతోనే కోట్లాది మంది మనస్సులు దోచుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో నటించిన మీరా.. వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది. 2014లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పని చేస్తోన్న అనిల్ జాన్ టైటాన్‌తో మీరా వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు. అయితే వివాహం తర్వాత తలెత్తిన విబేధాల కారణంగా మీరా.. తన భర్తతో విడిపోయింది. అయినప్పటికీ ఆయన సినిమాలపైపు తిరిగి చూడలేదు. జీవితంలో ఉన్న ఒడిదుడుకుల కారణంగా సినిమాలకు దూరమైన ఆమె ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. కొంతకాలం ఓ మలయాళం సినిమాలో గెస్ట్ రోల్‌లో మీరా కనిపించింది. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుందట. సత్యన్ అంతికాడ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మీరా ఒప్పుకుందట. అల వైకుంఠపురంలో ఫేం జయరాం హీరోగా నటిస్తున్న ఓ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాకు మీరా సైన్ చేసినట్లు సత్యన్ అంతికాడ్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించాడు. ఈ జూలైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. మరి భూమిక, స్నేహాల లానే మీరా కూడా సెకెండ్ ఇన్నింగ్స్‌లో సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.


By April 16, 2021 at 01:08PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/meera-jasmine-is-ready-to-give-re-entry-through-a-malyalam-movie/articleshow/82098696.cms

No comments