Breaking News

కరోనా సెకండ్ వేవ్ దెబ్బ.. ‘వకీల్‌సాబ్’ వసూళ్లకు బ్రేక్.. అక్కడైతే ‘అజ్ఞాతవాసి’ కంటే దారుణం..


పవర్‌స్టార్ నటించిన లేటెస్ట్ కోర్డ్ రూం డ్రామా చిత్రం ‘వకీల్‌సాబ్’. మూడు సంవత్సరాల తర్వాత పవన్ రీఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ మంచి కలెక్షన్లే రాబట్టింది. అయితే రెండో వారంలో వసూళ్లకు కాస్త బ్రేక్ పడినట్లే అని టాక్. కరోనా వైరస్ వ్యాప్తే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రెండో దశలో కరోనా వైరస్ రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతోంది. ప్రతీ రోజు లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. వేలాది మందిని మృత్యువు కబలిస్తోంది. దీంతో ప్రజలు తమ ఇళ్లు వదిలి బయటకు రావడానికే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో థియేటర్‌కి వచ్చి సినిమా చూసేవారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వకీల్‌సాబ్ సినిమా కలెక్షన్లలో వేగం తగ్గిన్నట్లు సమాచారం. ఇక విదేశాల్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా తెలుగు సినిమాలకు మరో నైజాంగా పిలుచుకొనే అమెరికాలో వకీల్‌సాబ్ ఊహించినంత కలెక్షన్లు సాధించలేదని సమాచారం. కరోనా కాలంలో అన్ని ప్రపంచ మార్కెట్ల కంటే అమెరికా మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు సెకండ్ వేవ్‌లోనూ అమెరికాను కరోనా విడిచిపెట్టడం లేదు. దీంతో అక్కడ తెలుగు సినిమా కలెక్షన్లు ఆగిపోయాయి. ఈ క్రమంలో అమెరికాలో ‘వకీల్‌సాబ్’ సినిమా భారీ నష్టాలను చవిచూస్తోందని అంటున్నారు. పవన్‌కళ్యాణ్ నటించిన డిజాస్టర్ చిత్రం ‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్లతోనే ఒక మిలియన్ డాలర్లు వసూళు చేసింది. అయితే అప్పటికీ కరోనా భయం లేదు. కానీ, ఇప్పుడు కరోనా భయం నెలకొనడంతో.. శుక్రవారం నాటికి వకీ‌ల్‌సాబ్ సినిమా 0.73 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. నిజానికి ఈ సినిమా అమెరికా కొనుగోలుదారుడికి లాభాలు రావాలంటే.. 1.4 మిలియన్ డాలర్ల వసూళ్లు రావాలి. కానీ, ప్రస్తుత పరిస్థితిలో ఒక మిలియన్ డాలర్లు కూడా వచ్చే అవకాశం లేదని అంటున్నారు. దీంతో ‘వకీల్‌సాబ్’ అమెరికా వసూళ్లలో కాస్త నిరాశ పరిచిందని అంతా అనుకుంటున్నారు.


By April 18, 2021 at 12:45PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vakeel-saab-movie-collections-hugely-reduced-in-us-due-to-corona/articleshow/82127323.cms

No comments