Breaking News

బెంగళూరు వెళ్లేవారికి అలర్ట్.. 144 సెక్షన్, నేటి నుంచి కొత్త నిబంధనలు


రోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో బుధవారం (ఏప్రిల్ 7) నుంచి 144 సెక్షన్‌ను విధించింది. కర్ణాటకలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వైరస్‌ కట్టడి కోసం మరిన్ని కఠిన నిర్ణయాలను ప్రకటించింది. 144 సెక్షన్‌తో పాటు.. అపార్ట్‌మెంట్లు, నివాస సముదాయాల్లోని ఈత కొలనులు, జిమ్‌లు, పార్టీ హాళ్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఒక్క రోజే 6150 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క బెంగళూరులోనే 4266 కేసులు ఉన్నాయి. ఇది నగరంలో పరిస్థితికి అద్దం పడుతుతోంది. అంతేకాదు, కరోనా కారణంగా కర్ణాటకలో మంగళవారం 39 మంది మరణించగా.. వీటిలో 26 మరణాలు బెంగళూరులోనే నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. కర్ణాటకలో కొవిడ్ కారణంగా 12,696 మంది మరణించారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 10.26 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అక్కడ 45,107 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు.. పంజాబ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ విధించారు.


By April 07, 2021 at 05:26PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-govt-imposes-new-restrictions-in-bengaluru-under-144-section-to-curb-covid-19-spread/articleshow/81951729.cms

No comments