Breaking News

షాకింగ్ వీడియో పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి.. బడా స్టార్ కూతురే టార్గెట్‌! బాబోయ్ 11 నిముషాల పాటు..


సోషల్ మీడియా సంచలనాలకు మారు పేరుగా మారింది . ఒకానొక సమయంలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో బడా బాబుల చీకటి కోణాలు బయటపెట్టిన ఆమె గత కొంతకాలంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని పలువురు సెలబ్రిటీలపై విరుచుకుపడుతోంది. టాలీవుడ్ వదిలి చెన్నైకి మకాం మార్చేసినా కూడా తాను టార్గెట్ చేసిన ఏ ఒక్కరినీ అంత ఈజీగా వదలడం లేదు. సమయం, సందర్భం చూసి వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బడా స్టార్ మోహన్ బాబు కూతురుని టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి ఏకంగా 11 నిమిషాల పాటు మంచు లక్ష్మిని దారుణంగా ట్రోల్ చేసింది. ఎందుకు టార్గెట్ చేసిందో తెలియదు కానీ భర్త, మంచు లక్ష్మి కుమార్తెను కూడా ఉద్దేశించి శ్రీ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అచ్చం మంచు లక్ష్మి లాగే ఇంగ్లీషు యాక్సెంట్ వాడేస్తూ ఎఫైర్స్ టాపిక్ కూడా బయటకుతీసి రచ్చ రచ్చ చేసింది శ్రీ రెడ్డి. నా పేరు పంచు లక్ష్మి అంటూ వీడియో మొదలుపెట్టి మధ్యలో పికుల్ ప్రీత్ సింగ్ అంటూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ని కూడా లాగుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. పొట్టి బాటలు వేయకు అని చెబుతూ బగ్స్ మ్యాటర్ బయటకు తీసింది. డాడీ అంటే నాకు రెస్పెక్ట్ ఉండదు.. కానీ మీడియా ముందు వాళ్ళ పేర్లు చెప్పుకుంటేనే మా బతుకు, అందుకే కేవలం మీడియా ముందు మాత్రమే డాడీ గురించి మాట్లాడతా అంటూ చిచ్చు రేపింది శ్రీ రెడ్డి. నాకు పెళ్ళైనా పెళ్లి అవనట్లే.. పిల్లలున్నా ఉన్నట్టే లేనట్టే.. ఎందుకంటే నేను కనలేదు.. బట్ నావే విత్తనాలన్నీ అంటూ మంచు లక్ష్మి స్పూఫ్ వీడియోతో శ్రీ రెడ్డి చేసిన హంగామా మామూలుగా లేదండోయ్.


By April 22, 2021 at 11:02AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sri-reddy-shocking-shared-shocking-video-on-manchu-lakshmi/articleshow/82192820.cms

No comments