Breaking News

RRR: మెగా, నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి


బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత అదే రేంజ్‌లో రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా . పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచే దేశవ్యాప్తంగా అందరి కళ్లు ఈ భారీ ప్రాజెక్టుపై పడ్డాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అనే కుతూహలం పెరిగింది. ఈ నేపథ్యంలో మధ్య మధ్యలో RRRకి సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని అమాంతం పెంచేస్తున్నారు జక్కన్న. ఇందులో భాగంగా తాజాగా హీరోయిన్ ఆలియా భట్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని RRR మూవీ రూపొందిస్తున్న రాజమౌళి.. ఈ సినిమాలో '' పాత్ర పోషిస్తున్న ఆలియా భట్ ఫస్ట్ లుక్ రివీల్ చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 15వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ పోస్టర్ రిలీజ్ కానుందని తెలుపుతూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇది చూసి ఆలియా లుక్ కోసం వెయిటింగ్ ఇక్కడ అంటూ మెగా, నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు RRRని వీలైనంత త్వరలో రిలీజ్ చేయాలని షూటింగ్ పనులు శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు జక్కన్న. ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ మూవీగా 1920 బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా చెర్రీ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ కనిపించబోతున్నారు. Also Read: డీవీవీ దానయ్య సమర్పణలో రూపొందుతున్న ఈ భారీ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ కూడా కీల‌క పాత్ర‌ పోషిస్తుండటం విశేషం. చిత్రంలో రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా భాగమవుతున్నారు. దీంతో ఈ మూవీ ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబ‌ర్ 13న RRR మూవీని విడుద‌ల చేయాలనేది జక్కన్న ప్లాన్.


By March 13, 2021 at 02:45PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/alia-bhatt-crazy-update-from-rajamoulis-rrr/articleshow/81482440.cms

No comments